ఇటీవలే వివాహేతర సంబంధాలు( Extramarital affairs ) అన్ని తీవ్ర విషాదంతో ముగుస్తున్న సంఘటనలు చూస్తూనే ఉన్నాం.ఇలాంటి కోవలోనే ఓ మహిళ వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తి చేతులో దారుణ హత్యకు గురైంది.
ఇక ఈ హత్య కేసు ను చేదించడం పోలీసులకు అంతుచిక్కని మిస్టరీ గా మారింది.చివరికి ఒక చిన్న క్లూ తో పోలీసులు నిందితున్ని పట్టుకున్నారు.
ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఏమిటో చూద్దాం.
వివరాల్లోకెళితే.
విశాఖపట్నం( Visakhapatnam ) కి ఆరు సంవత్సరాల క్రితం ప్రదీశ్ ( Pradesh )అనే వ్యక్తి కేరళ నుంచి వలస వచ్చాడు.ఇతనికి వివాహం అయ్యి ఇద్దరు పిల్లలు సంతానం.
ప్రదీశ్ చిప్పాడలోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.అయితే విజయనగరం జిల్లా భోగాపురం ప్రాంతానికి చెందిన ఓ మహిళతో పరిచయం ఏర్పడింది.
ఈమెకు ఇంతకుముందే వివాహం అయ్యి ఇద్దరు పిల్లలు ఉన్నారు.ప్రదీశ్ కు ఆ వివాహితకు మధ్య ఉన్న పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది.

కొంతకాలం వీరి వివాహేతర సంబంధం సాఫీగానే సాగింది.ఈనెల 11న ఆ వివాహితను ప్రదీశ్ తన ఇంటికి తీసుకువెళ్లి కాసేపు ఏకాంతంగా గడిపిన తర్వాత ఇద్దరి మధ్య డబ్బుల విషయంలో గొడవ జరిగింది.మద్యం మత్తులో ఉన్న ప్రదీప్ భవనం పైనుంచి ఆ వివాహితను తోసేశాడు.అనంతరం ఆమెను ఇంటిలోకి తీసుకువెళ్లి మెడకు చున్నీ బిగించి హత్య చేశాడు.ఆమె శరీర అవయవాలను ముక్కలు ముక్కలుగా కోసి ఒక బెడ్ షీట్లో చుట్టుకుని బైక్ పై తీసుకువెళ్లి తగరపువలస శివారు ఆదర్శనగర్ లోని నిర్మానుష్య ప్రాంతంలో పడేసి అక్కడి నుండి వెళ్లిపోయాడు.

అయితే దారి మధ్యలో బైక్ అదుపుతప్పి కింద పడింది.ఆ శబ్దానికి స్థానికులు వచ్చి ప్రదీశ్ బట్టలకు రక్తపు మరకలు చూసి అనుమానంతో అతని బైక్ నెంబర్ 3807ను ఓ గోడమీద రాశారు.ఆ పక్కనే అతని చెప్పులు కూడా పడి ఉన్నాయి.
ఆ వివాహిత ఎంతసేపటికి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆ ప్రాంతాన్నంత జల్లెడ పట్టారు.తర్వాత ఆమె మృతదేహం లభించడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు అనుమానాస్పద మరణంగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.కానీ మృతదేహం దొరికిన చోట ఎటువంటి ఆధారాలు దొరకలేదు.
ఇక పోలీసులకు ఈ కేసు అంతు చిక్కని మిస్టరీగా మిగిలిపోయింది.అయితే ఆ ప్రాంతంలో ఉండే ఒక గోడపై 3807 నెంబర్ కనిపించింది.
పోలీసులకు ఆ నెంబర్ పై ఏదో అనుమానం వచ్చి ఆ కోణంలో విచారించగా ఆ నెంబర్ బైక్ నెంబర్ అని తేలింది.AP 39HK 3807 బైక్ ను గుర్తించి, నిందితుడైన ప్రదీశ్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తే అసలు నిజం బయటపడింది.







