టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ హీరోలు తమ జనరేషన్ ఆలోచనలన్నీ వదిలేసి ఎప్పటికప్పుడు కొత్త కొత్తగా అప్డేట్ అవుతున్నారు.యంగ్ హీరోల మాదిరిగా కనిపిస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు.
సినిమాలే విషయంలోనే కాకుండా వ్యక్తిగత విషయంలో కూడా వారి ఆలోచనలన్నీ మారిపోయాయి.ప్రస్తుతం కొంతమంది సీనియర్ హీరోలు ఈ జనరేషన్ తగ్గట్టుగా కనిపిస్తున్నారు.
అందులో ఒకరు బాలయ్య.
నందమూరి బాలయ్య( Nandamuri Balakrishna ) గురించి, ఆయన వ్యక్తిత్వం గురించి ఎంత చెప్పినా తక్కువే.
మూడు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతూ నటించిన ప్రతి ఒక్క సినిమాతో మంచి మంచి హిట్ లు సంపాదించుకున్నాడు.ఇక ఇప్పుడు కూడా ఇండస్ట్రీలో తన హవా ఎక్కువగా నడుస్తుంది.
అప్పటి హీరోయిన్లతోనే కాకుండా ఈ తరం హీరోయిన్లతో కూడా తెగ రొమాన్స్ లు చేస్తున్నాడు బాలయ్య.
ఏకంగా కూతుర్ల వయసున్న హీరోయిన్ ల సరసన నటిస్తున్నాడు.
ప్రస్తుతం వరుస సినిమాలతో బాగా బిజీగా ఉన్నాడు.ఒక సినిమా షూటింగ్ బిజీలో ఉండగానే మరో సినిమాకు సైన్ చేస్తున్నాడు.
ఆ మధ్యనే అఖండ, వీరసింహా రెడ్డి సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్నాడు.ఇక ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి సినిమాలో( Bhagavanth Kesari Movie ) నటిస్తున్నాడు.
ఇక వెంకీ అట్లూరితో కూడా మరో సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు.

అయితే ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం భగవంత్ కేసరి సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు.ఇందులో కాజల్ అగర్వాల్, శ్రీ లీల హీరోయిన్లుగా నటిస్తున్నారు.రీసెంట్గా కాజల్ పుట్టినరోజు( Kajal Aggarwal ) సందర్భంగా కాజల్ కి సంబంధించిన పోస్టర్ కూడా షేర్ చేశారు.
అందులో కాజల్ స్టైలిష్ లుక్ లో కనిపించింది.

దీంతో చిత్ర బృందం ఆమెకు బర్త్ డే విష్ చేయగా.ఆమె బర్త్డే రోజు బాలయ్య ఆమెకు అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చాడు అని తెలిసింది.ఇక ఆ గిఫ్ట్ ఏంటంటే ఖరీదైన పట్టు చీర అని తెలిసింది ఇక బాలయ్య ఇచ్చిన గిఫ్ట్ కు కాజల్ చాలా సర్ప్రైజ్ గా, సంతోషంగా ఫీల్ అయిందట.
ఇన్నాళ్లు ఎంతోమంది స్టార్ హీరోలతో తను పనిచేసిన కూడా ఎవరు కూడా తనకు గిఫ్ట్ ఇవ్వలేదు అని.కానీ బాలయ్య తనకు ఎంతో ప్రేమగా పట్టు చీర కొనివ్వటంతో సంతోషంగా ఫీల్ అయ్యాను అని చెప్పుకొచ్చింది అని తెలిసింది.

ఇక ప్రస్తుతం ఈ వార్త బాగా వైరల్ అవ్వటంతో బాలయ్య అభిమానులు బాలయ్యలో ఈ యాంగిల్ కూడా ఉందా అంటూ మురిసిపోతున్నారు.ఇక ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు వెలువడ్డాయి.ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవుతే.ఇక బాలయ్య క్రేజ్ అందనంత ఎత్తుకు వెళ్లడం ఖాయమని చెప్పాలి.ఆ మధ్య బాలయ్య పుట్టినరోజు టీజర్ విడుదల కాగా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది.ఇక సినిమా విడుదల తర్వాత స్టోరీ ఎలా ఉంటుందో చూడాలి.







