సోషల్ మీడియా( Social media ) పాపులర్ అయిన తర్వాత చాలామంది యువతీ యువకులు ఒకరి గురించి మరొకరు పూర్తిగా తెలుసుకోకుండా గుడ్డిగా నమ్మి ప్రేమలో పడుతున్నారు.ఒకరి ఫోటోలను మరొకరు లైక్ చేయడం, కామెంట్ చేయడం, గంటల తరబడి మాట్లాడుకోవడం చేస్తున్నారు.
ఇలా చేస్తే ఎదుటి వ్యక్తి మనస్తత్వం పూర్తిగా తెలియదు.కాబట్టి చాలామంది ప్రేమలో పడి అడ్డంగా మోసపోతున్నారు.
ఇలాంటి కోవకు చెందిన ఒక ప్రేమ కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
హైదరాబాద్ నగరంలోని మూసాపేట( Moosapet )కు చెందిన ఓ యువతి ఇంస్టాగ్రామ్( Instagram ) ప్రొఫైల్ లో సురేష్ అనే యువకుడి ఫోటోకు లైక్ కొట్టింది.
తర్వాత ఇద్దరీ మధ్య చాటింగ్ చేయడం ప్రారంభమైంది.ఇక ఇద్దరూ ఒకరి ఫోన్ నెంబర్ మరొకరు తీసుకుని ఫోన్లో మాట్లాడుకోవడం ప్రారంభించారు.కొద్ది కాలానికి వీరి మధ్య ప్రేమ చిగురించింది.ఇక ఆ యువతి ఇంట్లో ఎవరూ లేని సమయంలో సురేష్( Suresh ) ను ఇంటికి ఆహ్వానించింది.

సురేష్ ఆ అమ్మాయి ఇంటికి వెళ్లి తనకు కూల్ డ్రింక్ కావాలని అడిగాడు.ప్రేమించిన వ్యక్తి కావడంతో కాదనలేక బయట ఉండే కూల్ డ్రింక్ షాప్ కు వెళ్లి కూల్ డ్రింక్ తీసుకువచ్చింది.ఆ యువతి బయటకు వెళ్లి వచ్చేలోపు సురేష్ ఇంట్లో ఉండే బీరువాలో ఉన్న ఆరు తులాల బంగారాన్ని దొంగిలించాడు.ఆ యువతి వచ్చాక కూల్ డ్రింక్ తాగి ఏదో పని ఉన్నట్లు తర్వాత కలుద్దాం అంటూ వెళ్లిపోయాడు.

కొంతకాలం తర్వాత మళ్లీ ఆ యువతీ సురేష్ ను ఇంటికి ఆహ్వానించింది.అదును చూసుకొని ఏకంగా సురేష్ 20 తులాల బంగారాన్ని దొంగిలించి వెళ్లిపోయాడు.కొన్ని రోజుల తర్వాత ఆ యువతి తల్లి బీరువాను సర్దే క్రమంలో నగలు కనిపించలేదు.కూతురిని గట్టిగా నిలదీస్తే సురేష్ అనే అబ్బాయి ఇంటికి వచ్చి వెళ్ళాడని తెలిపింది.
దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా, సురేష్ కు అనుమానం రాకుండా పోలీసులు చాకచక్యంగా పట్టుకొని తమదైన శైలిలో విచారించారు.అప్పుడు అసలు నిజం బయటపెట్టేశాడు.సురేష్ సోషల్ మీడియాలో అమ్మాయిలతో పరిచయాలు ఏర్పరచుకొని ఇలాంటి దొంగతనాలకు పాల్పడుతున్నాడని పోలీసులు తెలిపారు.







