ఆరెక్స్ డైరెక్టర్ తో కింగ్ సెట్..!

ఆరెక్స్ 100 సినిమాతో సూపర్ హిట్ అందుకున్న అజయ్ భూపతి( Ajay Bhupathi ) మొదటి సినిమాతోనే సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు.డైరెక్టర్ గా తన టాలెంట్ ఏంటో ఫస్ట్ మూవీతోనే చూపించిన అజయ్ భూపతి లాస్ట్ ఇయర్ మహా సముద్రం సినిమాతో నిరాశపరిచాడు.

 Rx 100 Director Nagarjuna Movie Set , Nagarjuna , Rx 100, Ajay Bhupathi, Mangala-TeluguStop.com

శర్వానంద్, సిద్ధార్థ్ కలిసి నటించిన ఈ సినిమా ఎందుకో అనుకున్న విధంగా ఆడియన్స్ ని మెప్పించలేకపోయింది.ప్రస్తుతం ఆరెక్స్ 100 డైరెక్టర్ మంగళవారం సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమాలో పాయల్ రాజ్ పుత్ లీడ్ రోల్ లో నటిస్తుందని తెలుస్తుంది.మేల్ లీడ్ ఎవరన్నది మాత్రం ఇంకా తెలియలేదు.

ఇదిలాఉంటే తన నెక్స్ట్ సినిమా కూడా ఫిక్స్ చేసుకున్నాడట అజయ్ భూపతి.అక్కినేని హీరో కింగ్ నాగార్జునతో( King Nagarjuna ) అజయ్ భూపతి సినిమా ఉంటుందని తెలుస్తుంది.

అజయ్ భూపీతి కథ మెచ్చిన నాగ్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.ఈ సినిమాను శ్రీనివాస్ చిట్టూరి తో పాటుగా అన్నపూర్ణ బ్యానర్ కూడా నిర్మాణ భాగం అవుతుందని తెలుస్తుంది.

మరి నాగ్ లాంటి రొమాంటిక్ హీరోతో అజయ్ భూపతి ఎలాంటి సినిమా చేస్తాడో చూడాలి.ఈం క్రేజీ కాంబోపై అక్కినేని ఫ్యాన్స్ కూడా సూపర్ ఎగ్జైటెడ్ గా ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube