గత కొంతకాలం నుండి రామ్ చరణ్, ఉపాసన( Ram Charan, Upasana ) బిడ్డ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ఫ్యామిలీ తాజాగా గుడ్ న్యూస్ చెప్పిన సంగతి తెలిసిందే.మెగా ఫ్యామిలీలోకి మెగా ప్రిన్సెస్ వచ్చిందని రామ్ చరణ్ ఆడబిడ్డకు జన్మనిచ్చారు అని తెలిసింది.
దీంతో మెగా అభిమానులు సంతోషంతో ఉప్పంగి పోతున్నారు.జూనియర్ ఉపాసన వచ్చిందని అంటున్నారు.
నిన్న ఉపాసన అపోలో హాస్పిటల్లో( Apollo Hospital ) అడ్మిట్ కాగా ఈరోజు ఆడబిడ్డకు జన్మనిచ్చింది.దీంతో మెగా ఫ్యామిలీ ఆనందంలో మునిగిపోయారు.ప్రతి ఒక్కరూ రామ్ చరణ్ దంపతులకు శుభాకాంక్షలు చెబుతూ మెగా ప్రిన్సెస్ కు వెల్కమ్ చెప్పారు.ఇక మెగా అభిమానులు నేరుగా అపోలో హాస్పిటల్ దగ్గరికి వెళ్లి జై చరణ్ అంటూ నినాదాలు చేస్తున్నారు.
ఇక చిరంజీవి తమ ఇంటికి ఆడపిల్ల వచ్చింది అని సంతోషంలో మునిగిపోయాడు.తాత అయినందుకు ఫుల్ ఖుషి లో ఉన్నాడు.
ఇక అల్లు అర్జున్ కూడా తన కోడల్ని చూడటానికి స్నేహ రెడ్డితో కలిసి వచ్చాడు.రామ్ చరణ్ కు పాప పుట్టినప్పటికి కొంతమంది అభిమానులు కాస్త ఫీల్ అవుతున్నట్లు కనిపించారు.
ఎందుకంటే చిరంజీవి ( Chiranjeevi )బిడ్డలకు కూడా ఆడపిల్లలే పుట్టారు అని.ఆయనకు ఒక మనువడు ఉంటే బాగుండేది అని.అది రామ్ చరణ్ కొడుకు ద్వారా తీరుతుంది అని అనుకున్నారు.

కానీ పాప పుట్టడంతో కాస్త నిరాశ చెందినా కూడా.సంతోషాన్ని మాత్రం చూపిస్తున్నారు.ఎవరైతే ఏంటి లే అని మళ్ళీ వాళ్ళే అనుకొని సమర్ధించుకుంటున్నారు.
ఇక రామ్ చరణ్ కూతురికి పేరు కూడా పెట్టలేదు కానీ అప్పుడే కాబోయే వాడి పేరు వైరల్ చేసేస్తున్నారు కొందరు జనాలు.తాజాగా ఇన్ స్టా లో ఒక పోస్ట్ బాగా వైరల్ అవుతుంది.
అందులో మెగా ప్రిన్సెస్ తాతలు – చిరంజీవి, పవన్, ఫాదర్ -రామ్ చరణ్, మదర్ – అపోలో చైర్మన్, బాబాయిలు – అకిరా, శంకర్, వరుణ్, మామయ్య – అల్లు అర్జున్, హస్బెండ్ – అయాన్.మోస్ట్ పవర్ఫుల్, ప్రెజర్ ఉంటది అని రాసుకొచ్చారు.
దీంతో మెగా ప్రిన్సెస్ కాబోయే భర్త అల్లు అర్జున్ కొడుకు అని తెగ వైరల్ చేసేస్తున్నారు జనాలు.

పాప పుట్టి 24 గంటలు కూడా కాలేదు అప్పుడే పాపకి అత్తింటి అడ్రస్ పెట్టేశారు కదా అంటూ కొందరు సరదాగా కామెంట్లు చేస్తున్నారు.ఇక వరుసకి అయాన్ కు చరణ్ కూతురు మరదలు కావడంతో భవిష్యత్తులో కచ్చితంగా వీరిద్దరికే పెళ్లి జరుగుతుంది అని మెగా అభిమానులు అంటున్నారు.మరి ఈ విషయం గురించి రామ్ చరణ్, అల్లు అర్జున్ ఏమని స్పందిస్తారో చూడాలి.
ఇప్పటివరకు మెగా ప్రిన్సెస్ ఫోటోని బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారు మెగా ఫ్యామిలీ.మరి ఈ మెగా ఫ్యామిలీ తమ ముద్దుల ప్రిన్సెస్ ఫోటోను ఎప్పుడు పంచుకుంటారో చూడాలి.







