చరణ్ కూతురికి ఆ సెంటిమెంట్ కలిసొచ్చిందా.. చిరు, పవన్ స్థాయికి ఎదుగుతుందంటూ?

రామ్ చరణ్( Ram Charan ) భార్య ఉపాసన( Upasana ) పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.మెగా ఇంటికి వారసురాలు రావడంతో మెగా ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

 Lucky Sentiment For Charan Upasana Daughter Details, Ram Charan, Pawan Kalyan, M-TeluguStop.com

చరణ్ ఉపాసనల కూతురు జన్మ నక్షత్రం ప్రకారం చిన్నారి జాతకం అద్భుతంగా ఉందని తెలుస్తోంది.మరోవైపు చరణ్ ఉపాసనల కూతురు( Charan Upasana Daughter ) ఉన్నత స్థానానికి ఎదుగుతారని అందుకు సంబంధించి సాక్ష్యం ఇదేనని కొన్ని కామెంట్లు వైరల్ అవుతున్నాయి.

మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi ) పుట్టినతేదీ ఆగష్టు 22 అనే సంగతి తెలిసిందే.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) పుట్టిన తేదీ సెప్టెంబర్ 2 అనే సంగతి తెలిసిందే.

చరణ్ ఉపాసనల కూతురు పుట్టినరోజులో కూడా 2 నంబర్ ఉండటంతో సెంటిమెంట్ ప్రకారం చరణ్, ఉపాసనల కూతురుకు కలిసొస్తుందని చరణ్ ఉపాసన కూతురు ఉన్నత స్థానానికి ఎదగడం గ్యారంటీ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

Telugu Charan, Chiranjeevi, Pawan, Pawan Kalyan, Ram Charan, Ramcharan, Upasana,

చిరంజీవి, పవన్ స్థాయికి చరణ్, ఉపాసనల కూతురు ఎదుగుతుందంటూ కొంతమంది సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు తెగ వైరల్ అవుతున్నాయి.చరణ్ ఉపాసన కూతురు కెరీర్ పరంగా మరింత ఎదగడంతో పాటు ఉన్నత శిఖరాలను అధిరోహించి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.చరణ్ కు సైతం కూతురు జాతకం వల్ల ఎంతో మేలు జరిగే ఛాన్స్ ఉందని సమాచారం.

Telugu Charan, Chiranjeevi, Pawan, Pawan Kalyan, Ram Charan, Ramcharan, Upasana,

ఈరోజు తెల్లవారుజామున ఉపాసన పండంటి బిడ్డకు జన్మనిచ్చారు.నిన్నటినుంచి ఇందుకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ కాగా ఎట్టకేలకు ఆ వార్తలు నిజమయ్యాయి.చరణ్, ఉపాసన కలకాలం సంతోషంగా జీవించాలని కూతురు రాకతో రాబోయే రోజుల్లో చరణ్ ఉపాసనలకు కెరీర్ పరంగా మరింత కలిసిరావాలని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.వారసురాలి రాకతో మెగా ఫ్యామిలీ సంబరాలు అంబరాన్ని అంటాయని సమాచారం అందుతోంది.

ఈ ఏడాది మెగా ఫ్యామిలీకి మరింత కలిసిరావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube