యూపీలో దారుణం.. ముస్లిం యువకుడిని చెట్టుకు కట్టేసి.. జైశ్రీరామ్ అనాలంటూ..!!

ఉత్తరప్రదేశ్‌లోని( Uttar Pradesh ) బులంద్‌షహర్ జిల్లాలో ఒక షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.సాహిల్ ఖాన్( Sahil Khan ) అనే ముస్లిం వ్యక్తిని కొందరు చెట్టుకు కట్టేసి జై శ్రీరామ్ అని మతపరమైన నినాదం చేయాలంటూ బలవంతం చేశారు.

 Muslim Youth Shaved And Thrashed Made To Chant Jai Sriram In Uttarpradesh Detail-TeluguStop.com

ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.AIMIM పార్టీ నాయకుడు అసదుద్దీన్ ఒవైసీ( Asaduddin Owaisi ) కూడా ఈ షాకింగ్ వీడియోను ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు.

ఈ వీడియోలో సాహిల్ ఖాన్ అనే 28 ఏళ్ల ముస్లిం యువకుడిని చెట్టుకు కట్టివేసి, తలను సగం షేవ్ చేసి, జైశ్రీరామ్ అని జపించేలా బలవంతం చేయడాన్ని చూడవచ్చు.ఈ సంఘటన జూన్ 14న వైర్ గ్రామంలో జరిగింది.

అక్కడ మొబైల్ ఫోన్ దొంగలించాడనే అనుమానంతో సాహిల్ ని పట్టుకొని కొట్టారు.

మొదట్లో, సాహిల్‌పై దాడి చేసి వీడియో రికార్డ్ చేసిన వ్యక్తులపై అతని సోదరి పోలీసులకు ఫిర్యాదు చేసింది.కాగా పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు.అయితే, ఈ వీడియో చాలామంది దృష్టిని ఆకర్షించడంతో, బులంద్‌షహర్‌లోని సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్లోక్ కుమార్ ఈ కేసులో జోక్యం చేసుకున్నారు.

ఎఫ్ఐఆర్ నమోదు అయ్యేలా చర్యలు తీసుకున్నారు.సౌరభ్ ఠాకూర్, గజేంద్ర, ధని పండిట్ అనే ముగ్గురు వ్యక్తులను నిందితులుగా గుర్తించారు.సౌరభ్, గజేంద్రలను అరెస్ట్ చేయగా, ధని ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.

ఈ ఘటనపై స్పందించిన ఎస్‌ఎస్పీ సరైన చర్యలు తీసుకోకపోవడంతో పాటు బాధితుడిని జైలుకు పంపినందుకు కాకోడ్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ అధికారి అమర్ సింగ్‌ను సస్పెండ్ చేశారు.ఈ ఘటనపై ఎస్‌ఎస్పీ కూడా దర్యాప్తు ప్రారంభించి నివేదిక సమర్పించాల్సిందిగా ఎస్పీ సురేంద్ర నాథ్ తివారీని కోరారు.AIMIM నాయకుడు అసదుద్దీన్ ఒవైసీ తన ట్విట్టర్ ఖాతాలో ఈ వీడియోను పంచుకున్నారు.

సాహిల్ పట్ల పోలీసులు అన్యాయంగా వ్యవహరించారని విమర్శించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube