ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఫీల్డింగ్ సెట్టింగ్ చూస్తే మతి పోవాల్సిందే..!

క్రికెట్ మైదానంలో( cricket field ) జరిగే కొన్ని విన్నూత సంఘటనలు చూస్తే ఆశ్చర్య పోవాల్సిందే.ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్( England captain Ben Stokes ) గ్రౌండ్లో ఫీల్డింగ్ సెట్టింగ్ చేసిన తీరు చూసి స్టేడియంలో ఉండే ప్రేక్షకులంతా ఆశ్చర్యపోయారు.

 England Captain Ben Stokes's Fielding Setting Is Mind-blowing , England Captain-TeluguStop.com

తాజాగా యాషెస్ టెస్ట్ సిరీస్ లో ఇంగ్లాండ్- ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసింది.అయితే మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు తొలిరోజు 8 వికెట్ల నష్టానికి 393 పరుగులు చేసి అందరిని ఆశ్చర్యపరిచింది.

ఆస్ట్రేలియా కూడా తనదైన శైలిలో గట్టిగానే బదులు ఇచ్చే ప్రయత్నం చేసి మొదటి ఇన్నింగ్స్ లో 10 వికెట్ల నష్టానికి 386 పరుగులు చేసింది.

Telugu Ashes, Cricket Field, England Ben, Latest Telugu, Usman Khawaja-Sports Ne

ఇంగ్లాండ్ జట్టు కేవలం బ్యాటింగ్ లో మాత్రమే కాదు బౌలింగ్, ఫీల్డింగ్ లో కూడా తన సత్తా ఏంటో చూపించింది.అయితే ఆస్ట్రేలియా ఓపెనర్ ఉస్మాన్ ఖవాజాను( Usman Khawaja ) అవుట్ చేసేందుకు ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టాక్స్ సెట్ చేసిన ఫీల్డింగ్ చూస్తే ఎవరైనా ఆశ్చర్య పోవాల్సిందే.ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.

క్రికెట్లో పేసర్లు బౌలింగ్ చేస్తున్న సమయంలో ఎడ్జ్ లు వస్తాయని వికెట్ల వెనుక కాస్త ఎక్కువగా స్లిప్ ఫీల్డింగ్ పెట్టడం గురించి అందరికీ తెలిసిందే.పేసర్లు బౌలింగ్ చేస్తే బ్యాటర్లు నాన్ స్ట్రైకర్ వైపు లేదా సెమీ సర్కిల్ వైపు బాలును కొట్టే ప్రయత్నం చేస్తుంటారు.

Telugu Ashes, Cricket Field, England Ben, Latest Telugu, Usman Khawaja-Sports Ne

కానీ ఇంగ్లాండ్ కెప్టెన్ రివర్స్ వి షేప్ లో ఫీల్డింగ్ సెట్ చేశాడు.స్లిప్ లో ఒక్కరిని కూడా ఉంచకుండా నాన్ స్ట్రైకర్ ఎడమవైపు ముగ్గురు ఫీల్డర్లను, కుడి వైపు ముగ్గురు ఫీల్డర్లను సెట్ చేశాడు.ఇదంతా చూస్తున్న ప్రేక్షకులకు అక్కడ ఏం జరుగుతుందో కాసేపటి వరకు అర్థం కాలేదు.బౌలర్ బంతి వేయగా.ఉస్మాన్ ఖవాజా థర్డ్ మ్యాన్ దిశగా బంతిని ఆడే ప్రయత్నం చేసి క్లీన్ బౌల్డ్ అయ్యాడు.అప్పుడు బెన్ స్టొక్స్ ఫీల్డింగ్ సెట్టింగ్ గురించి అందరికీ అర్థమైంది.

ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా బెన్ స్టోక్స్ అద్భుతమైన ఫీల్డింగ్ సెట్ చేశాడంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube