తెలంగాణలో ఎన్నికలు( Telangana Elections ) సమీపిస్తున్న కొద్ది ఆ రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.ఏ పార్టీ ఎవరికి మద్దతు ఇస్తుందో, ఏ పార్టీ ఎవరితో విభేదిస్తుంతో అర్థం కానీ పరిస్థితిలో ఆ రాష్ట్ర రాజకీయాలు ఉన్నాయి.
ప్రస్తుతం గెలుపు విషయంలో ఎవరికి వారు ధీమాగా ఉన్నారు.ఈ నేపథ్యంలో ఏ పార్టీ పూర్తి విజయం సాధిస్తుంది అనేది అంతుచిక్కని ప్రశ్నే.
ఇదిలా ఉంచితే రాష్ట్రం ఏర్పడిన తరువాత ఇప్పటికే రెండు సార్లు అధికారం చేపట్టిన బిఆర్‌ఎస్( BRS).మూడో సారి కూడా విజయం సాధించాలని గట్టి పట్టుదలగా ఉంది.అందుకు తగ్గట్టుగానే వ్యూహరచన చేస్తూ ముందుకు సాగుతోంది.

అయితే గత రెండుసార్లు ప్రత్యేక్షంగాను పరోక్షంగాను బిఆర్‌ఎస్ కు మజ్లిస్ పార్టీ మద్దతు పలుకుతూ వచ్చింది.తెలంగాణలో 10 నుంచి 15 స్థానాలల్లో ప్రభావం చూపగల ఏంఐఏం మద్దతు.బిఆర్‌ఎస్ కు క్లిష్ట పరిస్థితుల్లో అవసరం పడే అవకాశం ఉంది.2014, 2018 ఎన్నికల్లో బిఆర్‌ఎస్ తిరుగులేని విజయం నమోదు చేసుకోగా.ఈ సారి బిఆర్‌ఎస్ కు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు( Congress ) గట్టి పోటీనిచ్చే అవకాశం కనిపిస్తోంది.
ఈ నేపథ్యంలో ఏంఐఏంతో సక్యతగా మెలగడం బిఆర్‌ఎస్ కు ఎంతో అవసరం.అయితే ఈ సారి మజ్లిస్ పార్టీ బిఆర్‌ఎస్ ను కాదని ఒంటరిగా బరిలోకి దిగే ఆలోచనలో ఉందట.

ప్రస్తుతం ఇదే తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది.సీట్ల విషయంలో ఏంఐఏం మరియు బిఆర్‌ఎస్ మద్య గందరగోళ వాతావరణం నెలకొందట.దీంతో ఏంఐఏం( MIM ) సింగిల్ గానే బరిలోకి దిగి సత్తా చాటాలనే ఆలోచనలో ఉన్నట్లు టాక్.ఇదే గనుక జరిగితే బిఆర్‌ఎస్ గట్టి దేబ్బే అని చెప్పుకోవాలి.
ప్రస్తుతం ఉన్న పోటీ దృష్ట్యా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కూడా గట్టిగానే సీట్లు కైవసం చేసుకుంటే.ఏంఐఏం మద్దతుతోనే బిఆర్‌ఎస్ అధికారం చేజిక్కించుకునే అవకాశం ఉంటుంది.ఈ నేపథ్యంలో ఏంఐఏం పార్టీ బిఆర్‌ఎస్ కు దూరమైతే.ఈసారి బిఆర్‌ఎస్ పార్టీ( KCR BRS ) అధికారం కోల్పోయే అవకాశం లేకపోలేదు.
మరి ఏంఐఏం పార్టీ బిఆర్‌ఎస్ కు హ్యాండ్ ఇవ్వకుండా కేసిఆర్ ఎలాంటి వ్యూహరచన చేస్తాడు.సీట్ల విషయంలో ఎలాంటి సర్దుబాటు చేస్తాడు అనేది ఇప్పుడు చూడాలి.








