ఆటవి రక్షణలో తన విధి నిర్వహణలో భాగంగా ప్రాణాలు కోల్పోయిన FRO శ్రీనివాసరావు భార్య భాగ్యలక్ష్మికి డిప్యూటీ తహసీల్దార్ గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా నేడు హరితోత్సవం సందర్భంగా ఆయా నియామక పత్రాన్ని నేడు హైద్రాబాద్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఅర్ గారు అందజేశారు.
విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన FRO శ్రీనివాస్ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా అదుకుందని, వారి సతీమణికి డిప్యూటీ తహసీల్దార్ ఉద్యోగాన్ని కల్పించడం పట్ల మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు హర్షం వ్యక్తం చేశారు.వారి కుటుంబం తరుపున ముఖ్యమంత్రి కేసీఅర్ గారికి కృతజ్ఞతలు తెలిపారు.







