తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రాకేష్ మాస్టర్ (Rakesh Master) మరణ వార్త ఇండస్ట్రీకి ఎంతో తీరనిలోటు అని చెప్పాలి.ఇక ఈయన అనారోగ్య సమస్యలతో బాధపడుతూ గాంధీ ఆస్పత్రిలో మరణించారు.
ఈ విధంగా ఈయన మరణించడంతో ఈయనకు సంబంధించిన ఎన్నో విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.రాకేష్ మాస్టర్ 1968 తిరుపతిలో జన్మించారు.
ఈయనకు ముగ్గురు అక్కయ్యలు ఒక అన్న తమ్ముడు కూడా ఉన్నారు.ఈయన హైదరాబాదులో ముక్కు రాజు మాస్టర్ (Mukku Raju Master) వద్ద కొంతకాలం శిష్యరికం చేశారు.

డాన్సర్ గా కెరియర్ ప్రారంభించిన రాకేష్ మాస్టర్ అనంతరం కొరియోగ్రాఫర్ గా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.ఇలా ఈయన కొరియోగ్రాఫర్ గా ఎంతో మంది స్టార్ హీరోలకు డాన్స్ కొరియోగ్రఫీ చేయడమే కాకుండా ఎంతోమందికి శిక్షణ కూడా ఇచ్చారు.ఈ క్రమంలోనే ఈయన దాదాపు 1500 సినిమాలకు పనిచేశారు. ‘లాహిరి లాహిరి లాహిరిలో’, ‘చిరునవ్వుతో’, ‘దేవదాసు’, ‘అమ్మో పోలీసోళ్లు’, ‘సీతయ్య’ సహా పలు సూపర్ హిట్ సినిమాలకు డాన్స్ కొరియోగ్రాఫర్ గా పనిచేశారు.

ఈ మధ్యకాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉన్నటువంటి రాకేష్ మాస్టర్ పెద్ద ఎత్తున యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలకు హాజరవుతూ పలువురి గురించి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.అయితే ఈయన మాట తీరు కారణంగా తనకు మతిస్థిమితం లేదని తనపై విమర్శలు కురిపించారు.అలాగే ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ డాన్స్ కొరియోగ్రాఫర్లుగా కొనసాగుతున్నటువంటి శేఖర్ మాస్టర్ (Sekhar Master) జానీ మాస్టర్(Johnny Master) కూడా ఈయన వద్ద శిష్యరికం చేసినవారే.వీరితోపాటు మరికొందరిని కూడా రాకేష్ మాస్టర్ ఇండస్ట్రీకి కొరియోగ్రాఫర్లుగా పరిచయం చేశారు.
ఇండస్ట్రీలో స్టార్ హీరోల సినిమాలకు కూడా పనిచేసే ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.







