పెరిగిన పవన్ గ్రాఫ్ .. టీడీపీ కి కొత్త టెన్షన్ 

జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan kalyan ) చేపట్టిన వారాహి యాత్ర అనుకున్న మేరకు సక్సెస్ అవుతోంది.పవన్ ప్రసంగాలు రాజకీయంగా సంచలనం సృష్టిస్తుండగా, ఆయన అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని కలిగిస్తున్నాయి .

 Increased Pawan Graph New Tension For Tdp , Tdp, Telugudesam, Cbn, Chandrababu-TeluguStop.com

గతంతో పోలిస్తే జనసేన గ్రాఫ్ కూడా పెరిగినట్లు ఇటీవల విడుదలైన కొన్ని సర్వేల్లోనూ తేలింది.దీంతో పవన్ మరింత ఉత్సాహంతో తన ప్రసంగాలకు పదును పెడుతున్నారు.

గతంలో ముఖ్యమంత్రి పదవి విషయంలో తనకు ఆశ లేదు అని ప్రకటించిన పవన్  మాత్రం తాను ముఖ్యమంత్రిని అవుతానంటూ సంచలన ప్రకటనలు చేస్తున్నారు.మొన్నటి వరకు జనసేన ప్రభావం అంతంత మాత్రమే అన్నట్టుగా ఉంటుందని భావించిన పవన్ టిడిపి పైనే ఎక్కువగా ఆశలు పెట్టుకున్నారు.

Telugu Ap, Chandrababu, Janasena Varahi, Lokesh, Telugudesam, Ysrcp-Politics

 అయితే ఇప్పుడు వారాహి యాత్ర( Varahi ) మొదలైన తరువాత జనసేన గ్రాఫ్ పెరగడం, అదే సమయంలో టిడిపి ఇంకా బలహీనంగానే ఉన్నట్లుగా అనేక సర్వేలో తేలడంతో పవన్ తన రూటు మార్చారు .ఎన్నికల సమయంలోనే పొత్తుల అంశంపై ప్రకటన చేస్తానని చెబుతూనే ,తాను ముఖ్యమంత్రి రేసులో ఉన్నాననే సంకేతాలు టిడిపికి ఇస్తున్నారు.ఇక పవన్ వారాహి యాత్రకు వస్తున్నంత స్థాయిలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్( Nara lokesh ) చేపట్టిన యువ గళం పాదయాత్రకు స్పందన రాకపోవడం వంటివి టిడిపిలో ఆందోళన కలిగిస్తున్నాయి.పవన్ కళ్యాణ్ పొత్తుల విషయంలో వ్యవహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.

టిడిపితో పొత్తు పెట్టుకోబోతున్నామనే అంశాన్ని ప్రస్తుతం ఎక్కడ ప్రస్తావించేందుకు ఇష్టపడడం లేదు.

Telugu Ap, Chandrababu, Janasena Varahi, Lokesh, Telugudesam, Ysrcp-Politics

 ఏపీ అంతటా వారాహి ద్వారా ఎన్నికల ప్రచారం నిర్వహించి , జనాల నుంచి వస్తున్న స్పందన జనసేన గ్రాఫ్ ఏ మేరకు పెరిగిందని సర్వే రిపోర్టులో తరువాత పొత్తుల వ్యవహారానికి వెళ్లాలని పవన్ భావిస్తున్నారట.జనసేనకు పొత్తులో భాగంగా 10 నుంచి 20 సీట్ల లోపు కేటాయించాలని టిడిపి ముందు భావించినా,  జనసేన గ్రాఫ్ పెరిగితే పవన్ 50 సీట్లకు పైగా పొత్తులో భాగంగా కోరే అవకాశం ఉండడం వంటివి టిడిపికి టెన్షన్ పుట్టిస్తున్నాయి.జనసేనకు ఎంత బలం పెరిగితే అంత తమకు నష్టం అనే అభిప్రాయం టిడిపిలో ఉంది.

అంతేకాదు ముఖ్యమంత్రి పదవి విషయంలోనూ పవన్ నుంచి షరతులు ఉండే అవకాశం ఉండొచ్చని టిడిపి అంచనా వేస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube