ఆదిపురుష్( Adipurush ) సినిమాపై వస్తున్న విమర్శలు అన్నీఇన్నీ కావు.ఏ సోషల్ మీడియా( Social media) అకౌంట్ ఓపెన్ చేసినా ఈ సినిమా గురించి వైరల్ అవుతున్న మీమ్స్, ట్రోల్స్ హాట్ టాపిక్ అవుతున్నాయి.
అయితే తాజాగా ఆదిపురుష్ టీం నుంచి వచ్చిన స్టేట్మెంట్ హాట్ టాపిక్ అవుతోంది.మేం తీసింది రామాయణం కాదని ఈ సినిమాకు డైలాగ్ రైటర్ గా పని చేసిన మనోజ్ ముంతశిర్( Manoj munthasir ) చెప్పుకొచ్చారు.
రామాయణం నుంచి ప్రేరణ పొంది ఆదిపురుష్ తీశామని ఆయన వెల్లడించారు.

డిస్ క్లైమర్ లో కూడా ఈ విషయాన్ని పొందుపరిచామని మమ్మల్ని నిందించవద్దని ఆయన చెబుతున్నారు.ఈ విషయం ముందే క్లియర్ గా చెప్పి ఉంటే అసలు సినిమాకే వెళ్లకుండా ఉండేవాళ్లం అని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఒక టీవీ ఛానల్ చర్చా కార్యక్రమంలో మనోజ్ ముంతాషిర్ మాట్లాడుతూ ఈ కామెంట్లు చేశారు.
ఆదిపురుష్ మూవీ కల్పిత కథ అని ఆయన పేర్కొన్నారు.

ఆదిపురుష్ మూవీ గురించి భారీ స్థాయిలో విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఆదిపురుష్ మూవీ టీం మాత్రం సైలెంట్ అయింది.ఆదిపురుష్ మూవీ ఇప్పటివరకు 200 కోట్ల రూపాయల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకోగా రాబోయే రోజుల్లో ఈ సినిమా ఏ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది.మరోవైపు సోషల్ మీడియాలో బ్లాక్ బస్టర్ ఆదిపురుష్ అనే ట్యాగ్ తెగ వైరల్ అవుతోంది.
ఆదిపురుష్ సినిమా రిజల్ట్ విషయంలో ఇలా జరగడం ఫ్యాన్స్ ను బాధ పెడుతుండటం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతుండటం గమనార్హం.ఆదిపురుష్ ఫుల్ రన్ లో భారీ రేంజ్ లో కలెక్షన్లను సొంతం చేసుకుంటుందో లేదో చూడాల్సి ఉంది.
ఆదిపురుష్ సినిమా ప్రేక్షకులను తీవ్రస్థాయిలో నిరాశపరిచింది.







