మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న లేటెస్ట్ సినిమాల్లో ‘భోళా శంకర్( Bhola Shanka )’ ఒకటి.గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య వంటి రెండు భారీ సక్సెస్ లను అందుకున్న తర్వాత మెగాస్టార్ ఇప్పుడు తన నెక్స్ట్ సినిమాతో హ్యాట్రిక్ విజయం సాధించాలని తహతహ లాడుతున్నాడు.
అందుకే మరింత ఫాస్ట్ గా ఉత్సాహంగా నెక్స్ట్ సినిమాను పూర్తి చేస్తున్నాడు.భోళా శంకర్ షూట్ ఎప్పుడో స్టార్ట్ అయ్యింది.
ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ చివరి దశకు చేరుకున్నట్టు తెలుస్తుంది.తమిళ్ సూపర్ హిట్ సినిమా వేదాళం సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను మెహర్ రమేష్ డైరెక్ట్ చేస్తున్నాడు.
రీమేక్ అయినప్పటికీ ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగేలా మెహ రమేష్( Meher Ramesh ) ప్రమోషనల్ కంటెంట్ ను వదిలాడు.

అందులోను మెహర్ రమేష్ హీరోలను వెరీ స్టైలిష్ గా చూపిస్తాడు కాబట్టి చిరు ను ఎంత స్టైలిస్ట్ గా చూపిస్తాడా అని అంతా వెయిట్ చేస్తున్నారు.ఇప్పటికే భోళా మానియా సాంగ్ రిలీజ్ అవ్వగా అందులో మెగాస్టార్ లుక్ కు ఫిదా అయ్యారు.రీమేక్ అయిన మెహర్ స్క్రిప్ట్ ను బాగా డిజైన్ చేసి తెరకెక్కించారని ఇన్సైడ్ టాక్.
కథలోని అన్ని ఎమోషన్స్ ను అద్భుతంగా తీసాడని అంటున్నారు.ఇదిలా ఉండగా ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా.
కీర్తి సురేష్( Keerthy Suresh ) చిరు చెల్లెలుగా నటిస్తుంది.మరి కీర్తి తాజాగా ఈ సినిమాలో తన డబ్బింగ్ స్టార్ట్ చేసినట్టు సోషల్ మీడియా వేదికగా తెలిపింది.
స్టూడియోలో మెహర్ రమేష్ ఆధ్వర్యంలో కీర్తి డబ్బింగ్ చెబుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఈ విషయాన్ని తెలిపింది.

ఇక వెన్నెల కిషోర్ – హైపర్ ఆది – సత్య వంటి కమెడియన్స్ నటిస్తున్న ఈ సినిమాకు మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నాడు.అలాగే అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.అలాగే ఈ సినిమాలో అక్కినేని యువ హీరో సుశాంత్ కూడా కీలక రోల్ పోషిస్తున్నాడు.
మరి ఈ సినిమాను ఆగస్టు 11న గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు.







