చైన్ స్నాచర్ గా మారిన కానిస్టేబుల్.. అడంగా ఎలా దొరికిపోయాడంటే..?

సమాజంలో ఎటువంటి దారుణాలు, దొంగతనాలు జరుగకుండా రక్షణ కల్పించే బాధ్యత పోలీసులదే.ఎవరైనా దొంగతనం చేస్తే బుద్ధి చెప్పాల్సిన పోలీసులే దొంగతనాలకు పాల్పడితే ఇక సామాన్య ప్రజలకు రక్షణ అనేది ఉండదు.

 The Constable Who Became A Chain Snatcher.. How Did He Get Caught..? , Constabl-TeluguStop.com

కానిస్టేబుల్ ( Constable )పగలంతా బుద్ధిమంతుడులా ఉంటూ తెల్లవారుజామున చైన్ స్నాచర్ గా మారి ప్రజల సొమ్మును దోచుకోవడం మొదలుపెట్టాడు.సాధారణంగా పోలీసులలో కేవలం కొంతమంది మాత్రమే లంచాలకు పాల్పడతారని అందరికీ తెలిసిందే.

కానీ బాధ్యత గల పోలీస్ అధికారి పార్ట్ టైం జాబ్ లాగా దొంగతనాలు చేస్తున్నాడు అంటే ఎవరైనా ఆశ్చర్యపోతారు.ఇంతకీ ఆ పోలీస్ కానిస్టేబుల్ దొంగగా మారాల్సిన అవసరం ఏమొచ్చింది.

దొంగతనాలు చేసి ఎలా దొరికిపోయాడో అనే వివరాలను చూద్దాం.

బానేశ్( Banesh ) అనే వ్యక్తి మంచిర్యాల జిల్లా( Mancherial ) మందమర్రిలోని కోటపల్లి పోలీస్ స్టేషన్లో పోలీస్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు.

అయితే బానేశ్ జల్సాలకు అలవాటు పడి, తెలిసిన వారందరి దగ్గర అప్పులు చేశాడు.ప్రతి నెల వచ్చే జీతం సరిపోకపోవడం, అప్పులు పెరిగిపోవడంతో ఏం చేయాలో అర్థం కాక చివరికి దొంగతనాలు చేసి అప్పులు తీర్చాలని నిర్ణయించుకున్నాడు.

ఇక దొంగతనాలు ఎప్పుడు చేయాలి.ఎక్కడ చేయాలి.ఏ సమయంలో చేయాలి అని ముందుగా పక్కా ప్రణాళికతో ప్లాన్ రచించుకున్నాడు.డ్యూటీలో ఉంటూనే తెల్లవారుజామున మంచిర్యాల, మందమర్రి రైల్వేస్టేషన్లో దర్జాగా దొంగతనాలు చేయడం ప్రారంభించాడు./br>

Telugu Banesh, Chain Snatcher, Mancherial-Latest News - Telugu

ఇక చైన్ స్నాచింగ్ కేసులు అధికం కావడంతో జీఆర్పీ పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.ఈ విషయం బానేశ్ కు తెలియదు.రోజు మాదిరిగానే మంచిర్యాల, మందమర్రి రైల్వేస్టేషన్లో చైన్ స్నాచింగ్ చేస్తూ రెడ్ హ్యాండెడ్ గా జీఆర్పీ పోలీసులకు చిక్కాడు.ఈ విషయం బయటకు తెలియకుండా జీఆర్పీ పోలీసులు గోప్యంగా ఉంచి బానేశ్ ను రిమాండ్ కు తరలించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube