మూగజీవాలకు కూడా మనస్సు ఉంటుంది.మనుషుల్లా వాటికి కూడా ఫీలింగ్స్ ఉంటాయని చెప్పడానికి ఈ వీడియోనే ఒక ఉదాహరణ అని చెప్పవచ్చు.
ఒక మనిషిని పరిగెత్తుకుంటూ వచ్చి ఒక చింపాంజీ హగ్ చేసుకుంది.ఇలా హగ్ చేసుకుని ఆ వ్యక్తిపై తనకు ఉన్న ప్రేమను చాటుకుంది.
దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది.కోట్లు పెట్టినా ఇలాంటి ప్రేమ దొరకదంటూ కొంతమంది కామెంట్లు పెడుతున్నారు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.

ట్విట్టర్( Twitter )లో ఇన్‌జాటర్ అనే వ్యక్తి ఒక వీడియోను షేర్ చేశారు.ఈ వీడియోలో ఒక వ్యక్తిని చింపాంజీ( Chimpanzee ) గట్టిగా కౌగిలించుకున్నట్లు కనిపిస్తోంది.దూరం నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి మరీ ఆప్యాయంగా కౌగిలించుకుంది.
ఆ చింపాంజీని సంరక్షించిన వ్యక్తి చాలాకాలం తర్వాత దానికి కలవడానికి వచ్చినట్లు తెలుస్తోంది.దీంతో అతడిని దూరం నుంచి చూసిన చింపాంజీ వెంటనే గుర్తు పట్టింది.
పరిగెత్తుకుంటూ వచ్చి అతడిని కౌగిలించుకుంది.చాలా కాలం తర్వాత అతడిని కలవడంతో ఇలా తన ప్రేమను చింపాంజీ చాటుకున్నట్లు తెలుస్తోంది.
చెంగున ఎగురుతూ, అరుస్తూ వచ్చి అతడిని హగ్ చేసుకుంది.

చింపాంజీ అలా వచ్చి చేయడంతో అతడు కూడా దానిని తన చేతుల్లోకి తీసుకుని కౌగిలించుకున్నాడు.చింపాంజీ వస్తుండగా చేతులు చాపి, మోకాళ్లపై కూర్చోని దానిని పిలిచాడు.చింపాంజీ పిల్ల( Baby chimpanzee ) రాగానే అతడిని రెండు చేతులతో హగ్ చేసుకుంది.
దీంతో సరదు వ్యక్తి కూడా చింపాంజీని హత్తుకుని ముద్దు పెట్టుకుంటూ ఎమోషనల్ అయ్యాడు.ఇది చూసిన వీక్షకులు కూడా కన్నీటి పర్యంతమవుతున్నారు.ఇద్దరి మధ్య ప్రేమకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.మనుషులు, జంతువుల మధ్య ఇంత మంచి స్నేహం ఏర్పడటం చూసి ఆశ్చర్యానికి గురవుతున్నారు.
ఎమోషనల్







