సాధారణంగా వైద్య వృత్తిలో కొనసాగే వారు రోజూ అనేక ఒత్తిళ్లకు గురవుతుంటారు.ముఖ్యంగా పేషెంట్లకు “మీరు బతకడం కష్టం, మీకు ఫలానా ప్రాణాంతక జబ్బు ఉంది, మీ కుటుంబ సభ్యుడు చనిపోయాడు” వంటి సున్నితమైన, దుర్వార్తలను చెప్పడం వారికి చాలా ఇబ్బందిగా ఉంటుంది.
మామూలుగా డాక్టర్లు తరచుగా వారి రోగులకు ఈ చెడు వార్తలను మానవీయ కోణంలో సానుభూతిని వ్యక్తపరుస్తూ అందజేయవలసి ఉంటుంది.అయితే ఈ ఇబ్బందిని చాట్‌జీపీటీతో( chatgpt ) తొలగించవచ్చని తాజాగా కాలిఫోర్నియా( California ) డాక్టర్లు ఆలోచన చేశారు.
అంతేకాదు ఆ అద్భుతమైన ఆలోచనను ఆచరణలో పెట్టారు.వారు చాట్‌జీపీటీ AI చాట్‌బాట్‌ను ఉపయోగించి బ్యాడ్ న్యూస్‌ను మంచి మార్గంలో అందజేస్తున్నారు.చాట్‌జీపీటీ అనేది ఓపెన్ఏఐ కంపెనీ గతేడాది నవంబర్‌లో పరిచయం చేసిన సంగతి తెలిసిందే.ఈ AI చాట్‌బాట్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు, టీచర్లకు, ఇంకా అనేక మందికి ఉపయోగపడుతోంది.
ఇప్పుడు ఇది వైద్యులు వారి రోగులతో మెరుగ్గా కనెక్ట్ అవ్వడానికి కూడా సహాయపడుతోంది.

కాలిఫోర్నియా యూనివర్సిటీలోని ( University of California )పరిశోధకులు చాట్‌జీపీటీ రోగులకు బ్యాడ్ న్యూస్ ఎలా తెలియజేస్తుందనే అంశంపై ఒక అధ్యయనం చేపట్టారు.ఈ స్టడీలో రోగి ప్రశ్నలకు చాట్‌జీపీటీ ప్రతిస్పందనలు మానవ వైద్యుల కంటే మరింత కచ్చితమైనవి మాత్రమే కాకుండా మరింత సానుభూతి కలిగి ఉన్నాయని కనుగొన్నారు.వాస్తవానికి, చాట్‌బాట్ ఆన్సర్లు సగటున ఏడు రెట్లు ఎక్కువ సానుభూతితో ఉన్నాయి.
చాలా సందర్భాలలో, వైద్య నిపుణులు డాక్టర్ ప్రతిస్పందన కంటే చాట్‌బాట్ ప్రతిస్పందనకే ప్రాధాన్యత ఇచ్చారు.

మరోవైపు చాట్‌జీపీటీ ఒక యూఎస్ మెడికల్ ఎగ్జామ్‌లో కూడా ఉత్తీర్ణత సాధించింది.ఓపెన్ఏఐ సరికొత్త వెర్షన్ GPT-4 మోడల్ హార్వర్డ్‌కు చెందిన ఒక వైద్యుడు, కంప్యూటర్ శాస్త్రవేత్త ప్రకారం మరింత మెరుగైన వైద్యపరమైన తీర్పును వెల్లడిస్తుంది.ఇండియాలో కూడా డాక్టర్లు దీనిని ఉపయోగించడం సాధ్యమవుతుంది.







