ప్రస్తుత సమాజంలో మానవత్వం అనే పదానికి విలువ లేకుండా పోతుంది.డబ్బు కోసం ఎన్ని దారుణాలు చేయడానికి అయినా వెనుకాడడం లేదు కొందరు దుర్మార్గులు.
ఇక వయసుతో సంబంధం లేకుండా ఒంటరిగా ఉండే మహిళలకు రక్షణ అనేది లేకుండా పోయింది.ఓ ఒంటరి వృద్ధురాలి ఇంట్లో అద్దెకు ఉండే బీహారి దంపతులు ఆమె వద్ద ఉండే బంగారు, నగదు పై కన్నేసి అతి దారుణంగా ఆ వృద్ధురాలితో పాటు ఆమెతో పాటు ఉండే తొమ్మిదేళ్ల చిన్నారిని హత్య చేశారు.
ఈ ఘటన రంగారెడ్డి జిల్లా( RangaReddy District ) నందిగామలో శుక్రవారం సాయంత్రం వెలుగులోకి వచ్చింది.అసలు వివరాలు ఏమిటో చూద్దాం.
వివరాల్లోకెళితే.రంగారెడ్డి జిల్లా నందిగామ( Nandigama )లో పార్వతమ్మ అనే వృద్ధురాలు ఒంటరిగా జీవిస్తోంది.పార్వతమ్మ లంబాడి తండలోని అంగన్వాడీలో ఆయాగా పనిచేస్తుంది.ఈమెకు ఎవరూ లేని కారణంగా సోదరుడి కుమారుడి కూతుర్ని తనకు తోడుగా ఉంచుకుంది.
అయితే పార్వతమ్మ ఇంట్లో అద్దెకు ఉండే దివాకర్, అంజలి అనే బీహారి దంపతులు నెల రోజుల క్రితం ఇల్లు ఖాళీ చేసి పక్క గల్లీలోకి మారారు.

అయితే ఆ ప్రాంతంలో పార్వతమ్మకు ఎవరు లేరని, ఆమె వద్ద బంగారం, డబ్బు అధికంగా ఉందని స్థానికులు చెప్పుకోవడం ఈ బీహారి దంపతులు విన్నారు.ఏలాగైన పార్వతమ్మ వద్ద ఉండే సొమ్ము దోచుకోవడం కోసం మాస్టర్ ప్లాన్ వేశారు.ప్లాన్ లో భాగంగా శుక్రవారం తెల్లవారుజామున ఆ వృద్ధురాలితో పాటు తొమ్మిదేళ్ల చిన్నారిని కూడా హత్య చేశారు.

అయితే హత్యలు ఉదయం జరిగితే సాయంత్రం పోలీసులకు ( Police )సమాచారం అందింది.పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.హత్యలు జరిగిన గంటల వ్యవధిలోనే పోలీసులు నిందితులను పట్టుకున్నారు.పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.







