అల్లం పంట( Ginger Crop ) అధికంగా అంతర పంటగా అధిక విస్తీర్ణంలో సాగులో ఉంది.ఉద్యానవన తోటలైన మామిడి, కొబ్బరి, బొప్పాయి, నిమ్మ తోటలలో అంతర పంటగా అల్లం సాగు చేయబడుతోంది.
తేమతో కూడిన వాతావరణం లో అల్లం సాగులో అధిక దిగుబడి( High Yielding ) పొందవచ్చు.ఈ పంటను సాగు చేయాలంటే ఇసుకతో కూడిన బంక నేలలు, ఎర్ర నేలలు, నల్ల రేగడి నేలలు అనుకూలంగా ఉంటాయి.
అయితే నీరు నిల్వ ఉండే నేలలు మాత్రం అనుకూలంగా ఉండవు.అల్లం పంటకు చీడపీడల బెడద, తెగుళ్ల బెడద చాలా ఎక్కువ.
కాబట్టి మొదటి నుంచి సస్యరక్షక చర్యలు పాటించి పంటను సంరక్షించుకుంటేనే అధిక లాభాలు పొందవచ్చు.
తెగుల నిరోధక, ఆరోగ్యవంతమైన అల్లం దుంపలను ఎంపిక చేసుకొని, ముందుగా విత్తన శుద్ధి చేసి ఆ తరువాత పొలంలో నాటుకోవాలి.
ఇక అల్లం మొక్కల( Ginger Plants ) మధ్య ఎప్పటికప్పుడు కలుపు నివారణ చర్యలు చేపట్టాలి.క్రమం తప్పకుండా నీటి తడులు అందించాలి.మొక్కలు ఎప్పుడూ నీడలో ఉండే విధంగా కాకుండా సూర్యరశ్మి తగిలే విధంగా నాటుకుంటే వివిధ రకాల తెగులు పంటను ఆశించే అవకాశం ఉండదు.

ఇక అల్లం పంటకు తీవ్ర నష్టం కలిగించే తెగులలో ప్రధానంగా బ్యాక్టీరియా వడలు తెగులు కీలక పాత్ర పోషిస్తాయి.ఈ తెగులు జులై, ఆగస్టు నెలలలో అల్లం పంటను అధికంగా ఆశించే అవకాశం ఉంటుంది.అల్లం మొక్కల ఆకుల అంచులు ఇత్తడి రంగులోకి మారి ముడుచుకుపోతే తెగులు సోకినట్టు నిర్ధారించుకోవాలి.
ఆ తర్వాత మొక్కలు క్రమంగా ఎండిపోతాయి.ఈ మొక్కలలో భూమికి దగ్గరగా ఉండే కాండాన్ని పరిశీలిస్తే చెడువాసన వస్తుంది.
కాబట్టి తొలి దశలోనే ఈ తెగులను అరికట్టాలి.

100 లీటర్ల నీటిలో స్టెష్టో సైక్లిన్ 20 గ్రాములు కలిపి, కాపర్ ఆక్సి క్లోరైడ్ 2 మిల్లీ.లీటర్లను ఒక లీటరు నీటిలో కలిపి ఈ మొత్తం మిశ్రమాన్ని మొక్కల వేర్ల వద్ద పోయాలి.దీంతో ఈ తెగులు తొలిదశలోనే అరికట్టబడి అధిక దిగుబడి పొందవచ్చు.







