రాజన్న సిరిసిల్ల జిల్లా: తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను (Telangana decade celebrations )పునస్కరించుకొని జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలోవివిధ కార్యక్రమాలు నిరహిస్తున్నామని అందులో భాగంగానే ఈ రోజు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్( Akhil Mahajan ) ఆదేశానుసారం జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న పాఠశాలల్లో, కళాశాలల్లో విద్యార్థిని,విద్యార్ధులకు మాధకద్రవ్యాల నిర్ములాన అనే అంశం మీద వ్యాసరచన పోటీలు నిర్వహించారు.వ్యాస రచన పోటీలలో పాల్గొని మొదటి రెండు స్థానాలలో వచ్చిన వారికి బహుమతులు ప్రధానం చేయడం జరిగింది.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.విద్యార్థి దశనుండే ఉన్నత లక్ష్యాలు ఏర్పాటు చేసుకుని క్రమశిక్షణ పట్టుదల ఓపికతో కష్టపడినప్పుడు మంచి విజయాలు సాధిస్తారన్నారు.ఉన్నత ఆశయాలు,చదువులో ముందంజ సమాజంలో రేపు గొప్ప పౌరులుగా తీర్చి దిద్దడానికి ఉపయోగపడుతుందని తెలిపారు.విద్యార్థినిలు క్రమశిక్షణ,సామర్థ్యం,పాజిటివ్ ఆలోచనలతో జీవితంలో ముందుకు సాగాలన్నారు.
ఉన్నతమైన లక్ష్యలను ఏర్పరచుకుని చదివి మీ తల్లిదండ్రులకు సమాజానికి మంచి పేరు తీసుకురావాలని తెలిపారు.సమయాన్ని వృధా చేయకుండా ఏర్పరుచుకున్న లక్ష్యాలను చేరుకునే వరకు నిరంతరం శ్రమించాలన్నారు.
విద్యార్థులు గంజాయి వంటి మత్తు పధార్థాలకు,సోషల్ మీడియా కు దూరంగా ఉండాలన్నారు.







