పెళ్లి సమయంలో ఊరేగింపు చేపట్టే సాంప్రదాయం ఉంది.ఇప్పుడు సాధారణంగా కారులో ఊరేగింపు చేపడుతున్నారు.
ఒకప్పుడు ఒంటెలు, గుర్రాలపై ఊరేగింపు చేపట్టేవారు.ఇప్పుడు కాలం మారి కార్లు అందుబాటులోకి వచ్చాయి.
దీంతో కారులో వధూవరులను తీసుకెళ్తున్నారు.ఇటీవల 70 ట్రాక్టర్లతో ఊరేగింపుగా ఒక వరుడు తన గ్రామం నుంచి వధువు గ్రామంలోని పెళ్లి మండపానికి వెళ్లాడు.
తాజాగా వినూత్న రీతిలో ఊరేగింపు చేపట్టారు.

ఒక వ్యక్తి వధువును జేసీబీలో కూర్చోబెట్టుకుని తీసకెళ్తున్నాడు.మాములుగా పల్లకిలో లేదా డోలీలోనో వధువును పెళ్లి మండపంలో తీసుకుని వచ్చి కూర్చోబెడతారు.కానీ ఇటీవల వినూత్న రీతిలో కొంతమంది ప్రయత్నిస్తున్నారు.
వివిధ వాహనాల్లో వధువు( Bride )ను తీసుకొచ్చి పెళ్లి మండపంపై ఉన్న వరుడి పక్కన కూర్చోపెడుతున్నారు.తాజాగా జేసీబీలో తీసుకెళ్లగా.
దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.కొంచెం కొత్తగా ఉండంతో దీనిని కొంతమంది తెగ వైరల్ చేస్తున్నారు.
ఈ వీడియోలో వధువరూలను ఊరేగించి తీసుకెళ్లే సమయంలో ఎలా అలంకరిస్తారో అదే విధంగా జేబీసీని అలంకరించారు.

రాంచీలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.రాంచీ( Ranchi )కి చెందిన ఒక యువకుడికి మహతో అనే అమ్మాయితో పెళ్లి చేయాలని ఇరు కుటుంబసభ్యులు నిర్ణయించారు.ఈ సందర్బంగా పూలతో అలకరించిన జేసీబీలో వధువును తీసుకెళ్లారు.
జేసీబీని (JCB )పూలతో ముస్తాబు చేసి వధువును తీసుకెళ్లడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు.జేసీబీ బకెట్‌పై పరువులు వేసి దానిపై వధూవరులతో పాటు మరొక వ్యక్తి కూర్చోని ఉన్నట్లు వైరల్ అవుతున్న ఈ వీడియోలో కనిపిస్తోంది.
కిల్లర్ 007 ఏ అనే ట్విట్టర్ అకౌంట్‌లో ఈ వీడియో షేర్ చేశారు.ఈ వీడియో ప్రస్తుతం ట్రెండింగ్‌గా మారింది.
కొత్తగా ఆలోచించారంటూ కొంతమంది కామెంట్ చేస్తున్నారు.







