టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ఉన్న గౌరవం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.చిరంజీవి( Chiranjeevi ) మెగాస్టార్ గా నిలిచి తన సోదరులను కూడా ఇండస్ట్రీకి పరిచయం చేశాడు.
అంతే కాదు తన కొడుకు రామ్ చరణ్ ను కూడా ఇండస్ట్రీకి పరిచయం చేశాడు.ఇక వీళ్ళనే కాకుండా తన అల్లుళ్లను, తమ్ముళ్ల కొడుకులను కూడా ఇండస్ట్రీ పరిచయం చేశాడు.
వాళ్లు కూడా చిరంజీవి సపోర్టుతో అడుగుపెట్టి తమ సొంత టాలెంట్ తో స్టార్ హీరోలుగా ఎదిగారు.ఇక చిరంజీవికి వ్యక్తిగతంగా కూడా మంచి గౌరవం ఉందని చెప్పాలి.
చిరంజీవి ఎంతో మందికి సహాయం చేస్తూ ఆదర్శంగా నిలిచాడు.ఇప్పటికి తనకు తోచిన సహాయం చేస్తూ అందరితో మంచి అభిమానం సంపాదించుకుంటూ పోతున్నాడు.
ఇక చిరంజీవి తన వారసులలో కొడుకులను మాత్రమే ఇండస్ట్రీకి పరిచయం చేశాడు కానీ కూతుర్లను మాత్రం అసలు ఇండస్ట్రీ పరిచయం చేయలేదు.దానికి కారణం ఏదో తెలియదు కానీ వాళ్ళు ఇండస్ట్రీకి పరిచయం లేకున్నా కూడా వాళ్ల ప్రవర్తన వల్ల ఇండస్ట్రీలో ఒక ముద్ర తెచ్చుకున్నారు.
అది కూడా పరువు పోయే విధంగా ప్రవర్తించారు.

నిజానికి చిరంజీవి తన ఫ్యామిలీని చాలా కేరింగ్ గా చూసుకుంటాడు.తన పిల్లలకు మంచి ఫ్రీడమ్ కూడా ఇచ్చాడు.వాళ్లు ఏది అడిగితే కూడా అది ఇచ్చాడు.
అలా వాళ్లు తప్పులు చేసినా కూడా సర్దుకొని పోయాడు.కొన్ని పరువు పోయే పనులు చేసినప్పటికీ కూడా సైలెంట్ అయ్యారు.
గతంలో చిరంజీవి చిన్న కూతురు శ్రీజ ( Sreeja Konidela ) ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లి పెళ్లి చేసుకొని మీడియా కంటపడి చిరంజీవి పరువు మొత్తం గంగలో కలిపేసింది.
ఆ తర్వాత చిరంజీవి ఏమి చేయలేక తన కూతుర్ని దగ్గరికి తీసుకున్నాడు.
అలా కొంతకాలం బాగున్న ఆ జంట మళ్ళీ విడిపోగా.మళ్లీ రెండో పెళ్లి చేసుకుంది శ్రీజ.
ఇక రెండో భర్తతో నైనా కలిసి ఉందా అంటే అతనికి కూడా విడాకులు ఇచ్చిందని తెలిసింది.అయినా కూడా చిరంజీవి తన మంచి మనస్తత్వంతో మళ్లీ కూతురిని దగ్గరకు తీసుకున్నాడు.

అయితే ఇదే తప్పు నాగబాబు ( Nagababu ) కూడా చేస్తున్నాడు.ఆయన తన కూతురు నిహారికను( Niharika Konidela ) కూడా చాలా గారాభంగా పెంచాడు.కానీ నిహారిక కూడా ఈమధ్య తన భర్తతో దూరంగా ఉంటుంది అని తెలిసింది.రీసెంట్గా తన అన్న ఎంగేజ్మెంట్ అప్పుడు కూడా తన భర్త తనతో లేకపోవడంతో విడాకులు తీసుకుందని క్లారిటీ వచ్చేసింది.
అయితే వీళ్ళ మధ్య వచ్చిన గొడవలు ఏమో తెలియదు కానీ ఇదంతా చిరంజీవి, నాగబాబు చేసిన తప్పు వల్ల జరిగిందని అంటున్నారు కొందరు జనాలు.

అంటే వాళ్ళు తమ కూతుర్లను బాగా గారాబంగా పెంపడం వల్లే ఇలా జరిగింది అని అంటున్నారు.ఆ కారణంతోనే అత్తారింట్లో కూడా వాళ్ళు ఉండలేకపోయారు అని.పైగా భర్తలను కూడా తమ ఆధీనంలో పెట్టుకోవాలని చూడటం.తిరిగి భర్తలకే కండిషన్స్ పెట్టే స్థాయికి వెళ్లడంతో వాళ్ళు వీళ్ళతో సర్దుకోలేక విడిపోయారు అని అంటున్నారు.అలా వీరు తమ కూతుర్లకు ఎక్కువ ఫ్రీడమ్ ఇచ్చి కాపురాలు ముక్కలు అయ్యేలా చేశారు అని అంటున్నారు.







