యుక్త వయసు ప్రారంభం అయ్యిందంటే చాలు మొటిమలు రావడం స్టార్ట్ అవుతాయి.ఈ మొటిమలు అందాన్నే కాదు మనశ్శాంతిని కూడా దూరం చేస్తాయి.
ముఖ్యంగా మగువలు మొటిమల కారణంగా ఎంతగానో వర్రీ అవుతుంటారు.మిమ్మల్ని కూడా మొటిమలు తరచూ వేధిస్తున్నాయా.? అయితే అస్సలు చింతించకండి.ఇప్పుడు చెప్పబోయే హోమ్ మేడ్ క్రీమ్ ను వాడితే మొటిమలు( Pimples ) పరార్ అవ్వడమే కాదు.
మళ్ళీ మళ్ళీ ఇబ్బంది పెట్టకుండా సైతం ఉంటాయి.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ క్రీమ్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.
ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో మూడు రెబ్బలు వేపాకు, పది తులసి ఆకులు( Tulsi Leaves ), నాలుగు టేబుల్ స్పూన్లు రోజ్ వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్ట్రైనర్ సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్ ను వేసుకోవాలి.అలాగే మూడు టేబుల్ స్పూన్లు వేప-తులసి ఆకుల జ్యూస్ ను వేసుకోవాలి.
చివరిగా చిటికెడు వైల్డ్ టర్మరిక్ పౌడర్( Turmeric Powder ), హాఫ్ టేబుల్ స్పూన్ గ్లిజరిన్, రెండు చుక్కలు టీ ట్రీ ఎసెన్షియల్ ఆయిల్ వేసుకుని దాదాపు ఐదు నిమిషాల పాటు స్పూన్ సహాయంతో బాగా మిక్స్ చేయాలి.తద్వారా ఒక మంచి స్మూత్ క్రీమ్ సిద్ధమవుతుంది.
ఈ క్రీమ్ ను ఒక బాక్స్ లో నింపుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.రోజు నైట్ నిద్రించే ముందు ముఖానికి తయారు చేసుకున్న క్రీమ్ ను అప్లై చేసుకుని రెండు నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేసుకోవాలి.
రెగ్యులర్ గా నైట్ నిద్రించే ముందు ఈ క్రీమ్ ను అప్లై చేసుకుని పడుకోవాలి.ఇలా చేస్తే మొటిమలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి.అలాగే కొత్త మొటిమలు రాకుండా సైతం ఉంటాయి.అంతేకాదు మొటిమలు తాలూకు మచ్చలు( Acne Scars ), ఇతర మొండి మచ్చలు ఏమైనా ఉన్నా సరే క్రమంగా మాయమవుతాయి.
పిగ్మెంటేషన్ సమస్యను నివారించడానికి కూడా ఈ హోమ్ మేడ్ క్రీమ్ అద్భుతంగా సహాయపడుతుంది.