ఏపీ ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ ఒక వ్యూహం ప్రకారం ముందుకు వెళ్తోంది.ఒకవైపు బిజెపితో పొత్తు ప్రయత్నాలు చేస్తూనే , మరోవైపు ఆ పార్టీని అనేక విషయాలపై ప్రశ్నిస్తూ సమాధానం చెప్పాలని నిలదీస్తోంది.
ఇటీవల కేంద్ర హోం మంత్రి అమిత్ షా( Amith shah ) విశాఖకు వచ్చి వైసిపి ప్రభుత్వం పైన, జగన్( YS Jagan Mohan Reddy ) పైన చివరి స్థాయిలో విమర్శలు చేశారు.అయినా టిడిపి మాత్రం అమిత్ షా వ్యాఖ్యలను సీరియస్ తీసుకోవడం లేదు.
ఒకవైపు ఏపీ ప్రభుత్వానికి అన్ని విధాలుగా కేంద్రం సహాయ సహకారాలు అందిస్తూనే, మరోవైపు విమర్శలు చేస్తూ ఉండడంతో, బిజెపి స్ట్రాటజీ ఏమిటనేది చంద్రబాబు గ్రహించారు.అందుకే ఒకవైపు బిజెపితో పొత్తు పెట్టుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తూనే, మరోవైపు వైసీపీతో బిజెపి వైఖరి పై తమకు అనుమానాలు ఉన్నాయని వాటిని ముందుగా క్లారిటీ ఇచ్చి తీరాల్సిందేనని, టిడిపి అధినేత చంద్రబాబు వ్యాఖ్యలను బట్టి అర్థమవుతుంది.
అమిత్ షా ఏపీకి వచ్చి, వైసిపి ప్రభుత్వంపై విమర్శలు చేసిన తర్వాత వైసిపి మంత్రులు బిజెపిపై విమర్శలు చేశారు.సరిగ్గా అదే సమయంలో టిడిపి కూడా బిజెపిపై విమర్శలు మొదలుపెట్టింది.ఇటీవల కేంద్ర హోం మంత్రి అమిత్ షా చంద్రబాబును ఢిల్లీకి పిలిచారు.పొత్తుల అంశంపై కీలకంగా చర్చించారు.తరువాత ఏపీకి వచ్చి వైసిపి ప్రభుత్వంపై విమర్శలు చేశారు.ఈ విమర్శలను స్వాగతించాల్సిన టిడిపి బిజెపిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ , అనేక విమర్శలు, ప్రశ్నలు వేస్తోంది.
ఒకవైపు బిజెపితో పొత్తు కోసం టిడిపి ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తూనే, మరోవైపు జగన్ ప్రభుత్వం పై బిజెపి చర్యలు తీసుకుంటేనే తాము నమ్ముతాము అన్నట్లుగా టీడీపీ వ్యవహరిస్తుంది.దీంతో బిజెపి ఇప్పుడు ఇబ్బందికర పరిస్తితులను ఎదుర్కొంటుంది.
తాము వైసీపీకి ( YCP )పూర్తిగా వ్యతిరేకమని బిజెపి చెప్పుకొని ప్రయత్నం చేస్తున్నా, ఎవరు నమ్మే పరిస్థితి లేకపోవడం, మరోవైపు కేంద్రం నుంచి ఏపీకి భారీగా నిధులు విడుదలవడం వంటివి బిజెపికి ఇబ్బందికరంగా మారగా, బిజెపి ద్వారానే ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకునే విధంగాను, అలాగే ఏపీ ప్రభుత్వం అనేక అవినీతి వ్యవహారాలకు పాల్పడిందని ,కేంద్ర దర్యాప్తు సంస్థలను రంగంలోకి దింపి ఏపీలో చోటు చేసుకున్న అవినీతి వ్యవహారాలను నిగ్గు తెలిస్తేనే బిజెపిని నమ్ముతాము అన్నట్టుగా టిడిపి వ్యవహరిస్తుండడంతో ఈ వ్యవహారాలన్ని బిజెపికి ఇబ్బందికరంగా మారాయి.