జపాన్‌కు చెందిన 23 ఏళ్ల రినా గొనోయి( Rina Gonoi ) తన జీవితంలో రెండే రెండు కలలు కన్నది.వాటిలో ఒకటి సైనికురాలిగా దేశానికి సేవ చేయాలని, మరొకటి జూడో క్రీడాకారిణిగా ఒలింపిక్స్‌లో పాల్గొనాలని.
అయితే, ఆమె గ్రౌండ్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్( Ground Self Defense Force ) (GSDF)లో సైనికురాలుగా చేరి తన మొదటి కల నిజం చేసుకుంది.కానీ ఆమె సంతోషం ఎంతో కాలం నిలవలేదు.
డిఫెన్స్ ఫోర్స్‌లో చేరిన కొద్ది రోజులకి ఆమె కలలు చెదిరిపోయాయి.ఆమె సహోద్యోగుల రోజూ ఆమెను లైంగిక వేధింపులకు గురి చేశారు.
ఈ వేధింపులలో భౌతిక దాడులు, ఆమె శరీరం గురించి అవమానకరమైన వ్యాఖ్యలు చేయడం వంటివి ఉన్నాయి.ఒకరోజు ముగ్గురు మగ సహోద్యోగులు ఆమెను ఒక టెంట్‌లోకి పిలిచి ఆమెపై లైంగిక వేధింపులకు ( sexual harassment )పాల్పడ్డారు.
అత్యాచారం కూడా చేశారు.ఈ ఘటనపై ఫిర్యాదు చేసినప్పటికీ, సాక్ష్యాధారాలు లేకపోవడంతో ఆమె ఫిర్యాదును కోర్టు కొట్టి వేసింది.
ఎంత ప్రయత్నించినా తనకు న్యాయం జరగకపోవడంతో ఆమె చివరికి జాబ్ మానేసి ఇంటికి తిరిగి రావాలని నిర్ణయించుకుంది.

రినా తన కథనాన్ని బహిరంగంగా పంచుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు, సమాజం నుంచి ఆమెకు ఎదురుదెబ్బలు తగిలాయి.అయినప్పటికీ, ఆమె కేసు జపాన్‌లో చాలామంది దృష్టిని ఆకర్షించింది.ఇతర బాధితులను వారికి జరిగిన అన్యాయాలతో ముందుకు వచ్చేలా చేసింది.
రినా తన కేసును దర్యాప్తు చేయాలని రక్షణ మంత్రిత్వ శాఖను కోరుతూ ఒక పిటిషన్ కోసం 100,000 సంతకాలను సేకరించింది.ఆమెకు బెదిరింపులు, అవమానకరమైన వ్యాఖ్యలు వచ్చినప్పటికీ, ఆమె న్యాయం కోసం తన పోరాటంలో కొనసాగింది.

రినా కేసు సైన్యంలోని లైంగిక హింస సమస్యలపై వెలుగునిచ్చింది.అంతర్గత విచారణకు దారితీసింది.ఫలితంగా, ఐదుగురు సైనికులు ఉద్యోగాలు కోల్పోయారు.యూనిట్ కమాండర్ సస్పెండ్ అయ్యారు.రక్షణ మంత్రిత్వ శాఖ రీనాకు క్షమాపణ చెప్పింది.100 అదనపు వేధింపు ఫిర్యాదులను కనుగొంది.ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని, ఆత్మరక్షణ దళ సభ్యులందరికీ రక్షణ కల్పించాలని రినా కోరింది.







