Divya Sridhar : భర్త చేతిలో అలాంటి కష్టాలు అనుభవిస్తున్నానన్న నటి.. నా బిడ్డకు రక్షణ కల్పించాలంటూ?

సీరియల్ నటి దివ్య శ్రీధర్, ఆర్నవ్ ( Divya sridhar )పేర్లు కొంతకాలంగా సోషల్ మీడియాలో మారుమోగుతున్న సంగతి మనందరికీ తెలిసిందే.2017లో ఒక సీరియల్‌ షూటింగ్‌లో వీరికి పరిచయం ఏర్పడగా ఆ పరిచయం కాస్త ప్రేమగా మరి ఇద్దరు పెళ్లి చేసుకున్నారు.పెళ్లయిన కొద్ది రోజులు పాటు బాగానే ఉన్న ఈ జంట దివ్య ప్రెగ్నెంట్ అయిన తర్వాత నుండి వీరిద్దరీ మధ్య గొడవలు ప్రారంభం అయ్యాయి.ఆమెకు గతంలో పెళ్లి అయ్యి, పాప ఉన్న విషయాన్ని దాచి పెట్టిందని ఆర్నవ్ ఆరోపించిన సంగతి తెలిసిందే.

 Divya Sridhar Requests Tamil Nadu Chief Minister Mk Stalin-TeluguStop.com

దివ్య కూడా ఆర్నవ్ ( Arnav )మరో నటితో సంబంధం పెట్టుకోవడంతో భరించలేక నిలదీయడానికి వెళ్లిన తనపై ఆర్నవ్ ఎటాక్ చేశాడంటూ అతనిపై గత ఏడాది పోలీసులకు పిర్యాదు కూడా చేసింది.

Telugu Arnav, Divya Sridhar, Kollywood, Mk Stalin, Tamilnadu-Movie

దివ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతన్ని అరెస్టు చేయగా బెయిల్‍పై విడుదల అయ్యాడు.అప్పటి నుండి ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటూనే ఉన్నారు.ఇది ఇలా ఉంటే ఇటీవలె వీరికి ఒక పాప కూడా జన్మించిన విషయం తెలిసిందే.

బెయిల్‌పై విడుదల అయిన ఆర్నవ్ తన మనుషులు, లాయర్ తో వచ్చి గొడవ పడ్డాడని దివ్య సంచలన ఆరోపణ చేసింది.అర్దరాత్రి ఒక్కసారిగా 15 మందితో తన ఇంటి తలుపు తట్టాడని తెలిపింది.

వారందరూ తనను తోసుకుంటూ ఇంట్లోకి చొరబడ్డారని ఆమె చెప్పుకొచ్చింది.గతంలో కూడా అతడికి అనేక మంది అమ్మాయిలతో ఎఫైర్ ఉందని ఆమె వెళ్ళడించింది.

Telugu Arnav, Divya Sridhar, Kollywood, Mk Stalin, Tamilnadu-Movie

ఇది ఇలా ఉంటే తాజాగా తనకు, తన పాపకు ప్రాణ హాని ఉందని, తమకు రక్షణ కల్పించాలంటూ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ను అభ్యర్థించింది.ప్రస్తుతం ఆర్నవ్ షరతులతో కూడిన బెయిల్‌పై ఉన్నాడని, ఈ సమయంలో అతను నా ఇంటికి రాకూడదు.కానీ మా ఇంటికి వచ్చి నన్ను బెదిరించి, నా పాపను చంపడానికి ప్రయత్నించాడు.నేను ఎక్కడికి వెళ్తున్నానో అతనికి అన్నీ తెలుసు.అందుకోసం ఒక వ్యక్తిని గూఢచారిగా పెట్టుకున్నాడు.ఎప్పటికైనా నన్ను చంపేస్తాడు.

నా ఇంట్లో ఇద్దరు వృద్ధులు కూడా ఉన్నారు.అలాంటి పరిస్థితుల్లో అతను మా ఇంటికి వచ్చి బెదిరించాడు.

పోలీసుల( Police )కు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోతుంది.ఆయనపై చర్యలు తీసుకునేలా చూడాలని ముఖ్యమంత్రిని కోరుతున్నాను అంటూ దివ్య కన్నీరు పెట్టుకుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube