గర్భిణీ ఇంటికి వెళ్ళి.... ఏఎన్ సి చెకప్ లపై ఆరాతీసి..

రాజన్న సిరిసిల్ల జిల్లా: మూడపల్లి గ్రామానికి చెందిన హరిత అనే గర్భవతి ఇంటికి వెళ్ళి, స్వయంగా వారి ఆరోగ్య పరిస్థితిని, వైద్య సిబ్బంది అందిస్తున్న సేవల గురించి జిల్లా కలెక్టర్ గురువారం ఆరా తీశారు.ప్రస్తుతం మీ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? వైద్య సిబ్బంది మీ యొక్క ఆరోగ్య స్థితిగతులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారా? ప్రస్తుతం ఏ ఆసుపత్రిలో చూపించుకుంటున్నారు? అంగన్వాడీ కేంద్రం ద్వారా కోడిగుడ్లు సక్రమంగా అందిస్తున్నారా అనే వివరాలను హరితను అడిగి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తెలుసుకున్నారు.

 District Collector Anurag Jayanthi Went To The Pregnant House And Asked For Anc-TeluguStop.com

ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ చేయించుకోవాలని, అత్యాధునిక సౌకర్యాలు, వసతులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్నాయని కలెక్టర్ అన్నారు.వైద్య సిబ్బంది ఇచ్చే ఐరన్ టాబ్లెట్స్ వేసుకోవాలని సూచించారు.ఆసుపత్రికి వెళ్ళడానికి అంబులెన్స్ అందుబాటులో ఉంటుందని, సేవలను వినియోగించుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ బి.సత్య ప్రసాద్ జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డా.సుమన్ మోహన్ రావు, తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube