సూర్యాపేట జిల్లా: దేశ సరిహద్దుల్లో శత్రు సైన్యంతో వీరోచితంగా పోరాడి వీర మరణం పొందిన అమరుడు కల్నల్ సంతోష్ బాబు మూడో వర్ధంతిని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని సంతోష్ బాబు విగ్రహానికి రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి జగదీష్ రెడ్డి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
దేశం కోసం త్యాగం చేసిన దివంగత సంతోష్ బాబు వర్తమానానికి స్ఫూర్తి దాయాకంగా నిలిచారని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్,మున్సిపల్ చైర్మన్ పెరుమాళ్ల అన్నపూర్ణమ్మ తదితరులు పాల్గొన్నారు.







