యూకే : ఎస్‌పీ జైన్ లండన్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌కు అరుదైన గౌరవం.. !!

యూకేలోని( UK ) ఎస్‌పీ జైన్ లండన్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఎస్‌పీజే లండన్)( SPJ London ) అరుదైన ఘనతను సాధించింది.యూకేలోని ఆఫీస్ ఆఫ్ స్టూడెండ్స్ ద్వారా డిగ్రీ ( Degree ) ప్రదానం చేసే అధికారాలను పొందింది.

 Uk S P Jain London School Of Management Granted Degree-awarding Rights Details,-TeluguStop.com

తద్వారా ఈ ప్రతిష్టాత్మక గుర్తింపు పొందిన తొలి భారత సంతతికి చెందిన ఉన్నత విద్యాసంస్థగా ఎస్‌పీజే లండన్ అవతరించింది.ఆఫీస్ ఆఫ్ స్టూడెండ్స్ అనేది ఇంగ్లాండ్‌లో ఉన్నత విద్య కోసం పనిచేసే స్వతంత్ర సంస్థ.

ఈ సందర్భంగా ఎస్‌పీ జైన్ గ్రూప్ వ్యవస్థాపకుడు, ప్రెసిడెంట్ నితీష్ జైన్( Nitish Jain ) హర్షం వ్యక్తం వ్యక్తం చేశారు.ఎస్‌పీజే లండన్‌కు ఇది కీలక మైలురాయిగా ఆయన పేర్కొన్నారు.

డిగ్రీ ప్రదానం చేసే హక్కులను పొందడమనేది అసాధారణమైన విద్యను అందించడంలో తమ నిబద్ధతను ధృవీకరించడమే కాకుండా ప్రపంచ ఉన్నత విద్యారంగంలో తమ సంస్థ అగ్రగామిగా నిలిచిందన్నారు.ఈ గుర్తింపును సాధించిన తొలి భారత సంతతి సంస్థగా నిలిచినందుకు గర్వంగా వుందని నితీష్ జైన్ వ్యాఖ్యానించారు.

భవిష్యత్తు తరం వ్యాపార నాయకులను ప్రోత్సహించడానికి, ప్రపంచంలో సానుకూల ప్రభావం చూపేలా వారిని తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని ఆయన చెప్పారు.

Telugu Degree, London, Nitish Jain, Sp Jain School, Spj London-Telugu NRI

ఇదిలావుండగా ఎస్‌పీజే లండన్ ఇటీవల ఎస్‌పీ జైన్ స్కూల్ ఆఫ్ గ్లోబల్ మేనేజ్‌మెంట్‌తో తన కొత్త ఎక్స్‌చేంజ్ అండ్ ఆర్టిక్యులేషన్ ఒప్పందాన్ని ప్రకటించింది.ఈ ఒప్పందం కింద లండన్‌తో పాటు ప్రపంచంలోని కీలక నగరాల్లో అధ్యయనం చేయడానికి ఇరు సంస్థలకు చెందిన విద్యార్థులకు అవకాశాలు అందుతాయి.ఈ ఒప్పందం ప్రకారం ఎస్‌పీజే లండన్‌లో నమోదు చేసుకున్న విద్యార్ధులు.

దుబాయ్, సింగపూర్, సిడ్నీ, ముంబైలలో వున్న ఎస్‌పీ జైన్ గ్లోబల్ క్యాంపస్‌లకు ప్రయాణించే ప్రత్యేక అవకాశం వుంటుంది.

Telugu Degree, London, Nitish Jain, Sp Jain School, Spj London-Telugu NRI

కాగా.సాహు శ్రేయాన్స్ ప్రసాద్ జైన్ పేరు మీద ఈ విద్యాసంస్థను నెలకొల్పారు ఆయన కుటుంబ సభ్యులు.ప్రసాద్ జైన్ భారత్‌లో వ్యాపారవేత్తగా, మానవతావాదిగా, రాజకీయవేత్తగా గుర్తింపు తెచ్చుకున్నారు.

బిజినెస్ మేనేజ్‌మెంట్ రంగంలో ఎస్‌పీ జే గ్లోబల్ కోర్సులను అందిస్తూ, ప్రపంచంలోని ఉన్నత విద్యా సంస్థగా గుర్తింపు తెచ్చుకుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube