బాహుబలి( Baahubali ) సినిమాతో ఒక్కసారిగా ప్రభాస్ రేంజ్ మారిపోయింది అనే చెప్పాలి.ఈ సినిమా తర్వాత డార్లింగ్ పాన్ ఇండియా స్టార్ గా అవతరించాడు.
బాహుబలి బ్లాక్ బస్టర్ హిట్ తో వెనక్కి తిరిగి చూసుకోవడం లేదు.బాహుబలితో అదరగొట్టిన ప్రభాస్ ఇప్పుడు మరోసారి బాక్సాఫీస్ ను గర్జించేందుకు వస్తున్నాడు.
బాహుబలి తర్వాత సాహో సినిమాతో వచ్చి ప్లాప్ అయిన కూడా 400 కోట్లు రాబట్టాడు.

అలాగే ఆ తర్వాత రాధేశ్యామ్ వంటి ప్లాప్ ఎదురైనా కూడా మళ్ళీ ప్రభాస్ రేపు రాబోతున్న ఆదిపురుష్ సినిమాతో తన దమ్ము చూపించేందుకు వస్తున్నాడు.జస్ట్ ఒకే ఒక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసి ప్రమోషన్స్ ఏమాత్రం చేయక పోయిన టికెట్ బుకింగ్స్ లో రికార్డ్స్ బద్దలు అవుతున్నాయి.ఇప్పుడు ఆదిపురుష్ కు ఇండియా వైడ్ గా రికార్డ్ రిజిస్ట్రేషన్స్ నమోదు అవుతున్నాయి.

అందుకే ఈసారి ఆదిపురుష్( Adipurush) సినిమాతో రికార్డ్ ఓపెనింగ్స్ ఖాయం అంటున్నారు.అందుకే ప్రభాస్ బాక్సాఫీస్ ను తన కంట్రోల్ లో పెట్టుకుని రేపటి కోసం మొత్తం టేకోవర్ చేసాడు.చూడాలి ఎన్ని కలెక్షన్స్ రాబట్టి రికార్డులు క్రియేట్ చేస్తుందో.భారీ విజువల్ ట్రీట్ గా తెరకెక్కిన ఈ సినిమా రామాయణం ఆధారంగా తెరకెక్కింది.ఈ ఇతిహాస కథను బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించగా ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా నటించగా కృతి సనన్ ( Kriti Sanon )సీత పాత్రలో నటించింది.ఇక బాలీవుడ్ స్టార్ హీరో లంకేశ్వరుడు రావణాసురుడి గా నటించాడు.
జూన్ 16న గ్రాండ్ గా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది.తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిన ఈ సినిమాను టి సిరీస్ సంస్థ, రిట్రో ఫైల్స్ 500 కోట్ల భారీ బడ్జెట్ తో సంయుక్తంగా నిర్మించారు.








