నకిలీ పోలీస్ కానిస్టేబుల్ గుట్టురట్టు.. విచారణలో విస్తుపోయే నిజాలు..!

ఆమె చదివింది ఇంటర్ మాత్రమే.ఆమె చూడడానికి అందంగా కనిపిస్తుంది.

 Police Arrests Fake Lady Constable In Hyderabad Details, Police ,fake Lady Const-TeluguStop.com

ఆమెకు డబ్బు అంటే పిచ్చి, కానీ కష్టపడకుండానే డబ్బు సంపాదించాలి అనేది ఆమె కోరిక.పోలీస్ కానిస్టేబుల్ గా( Police Constable ) అవతారం ఎత్తింది.

నకిలీ ఐడి కార్డ్( Fake ID Card ) చూపించి అమాయక యువకులను టార్గెట్ చేయడం ప్రారంభించింది.నగర పోలీస్ కమిషనర్ కార్యాలయం లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ పలువురిని బురిడీ కొట్టించి దొరికిన కాడికి దోచుకుంది.

అంతేకాదు ఆ యువకులలో కాస్త అందంగా ఉండే వారిని ప్రేమ పేరుతో కూడా మోసం చేసింది.ఒకరిని ప్రేమించి పెళ్లి చేసుకుని మరో ఇద్దరితో సహజీవనం చేస్తూ దర్జాగా బతికేస్తుంది.

తీగ లాగితే డొంక కదిలింది అనే విధంగా చివరికి పోలీసులకు చిక్కి కటకటాల పాలు అయింది.ఈమెకు సంబంధించిన పూర్తి వివరాలు ఏమిటో తెలుసుకుందాం.

హైదరాబాద్ లోని( Hyderabad ) లంగర్ హౌస్ లో నివసిస్తున్న అశ్విని( Ashwini ) ఇంటర్ పూర్తి చేసింది.అశ్విని జల్సాలకు అలవాటు పడి తన పేరును అశ్విని రెడ్డిగా మార్చుకొని తాను ఏఆర్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నానని ఒక నకిలీ ఐడి కార్డు తయారు చేసుకుంది.

ఈసీఐఎల్ లో ఉంటున్న రోహిత్ కిషోర్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది.వీరికి ఒక కుమార్తె, ఒక కుమారుడు సంతానం.తర్వాత అభిషేక్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకొని తన భర్తను చంపేందుకు మాస్టర్ ప్లాన్ వేసింది.ఆ ప్లాన్ కాస్త అట్టర్ ప్లాప్ అయ్యింది.

ఆ తరువాత భర్త రోహిత్ ను, ప్రియుడు అభిషేక్ ను దొంగతనాలు చేయాలని ఒత్తిడికి గురి చేసింది.

Telugu Abhisek, Ashwini, Lady, Hyderabad, Rohith-Latest News - Telugu

భర్త రోహిత్ దొంగతనం చేసి దొరికిపోయి జైలు పాలయ్యాడు.తన కథ బయటకు రాకుండా అశ్విని తన ప్రియుడు అభిషేక్ తో కలిసి మెహిదీపట్నంలో ఉంటూ సహజీవనం కొనసాగిస్తోంది.ర్యాపిడో వాహనాలను బుక్ చేసుకునే యువకులను టార్గెట్ చేసి, ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ తన నకిలీ ఐడి కార్డు చూపించి వలలో పడేసేది.

అశ్విని తనపై ఎవరికి అనుమానం రాకుండా ర్యాపిడో వాహనాన్ని బషీర్ బాగ్ లోని పోలీస్ కమిషనరేట్ కార్యాలయం ముందు ఆపి ఆ యువకులను బయట వదిలి లోపలికి వెళ్ళేది.

Telugu Abhisek, Ashwini, Lady, Hyderabad, Rohith-Latest News - Telugu

కొద్దిసేపటి తర్వాత బయటకు వచ్చి పని అయిపోయింది అంటూ నమ్మకపు మాటలు చెప్పి, ఏకంగా లక్షల్లో డబ్బులు తీసుకొని మోసం చేసేది.అయితే అశ్వినికి ఇంతకుముందే వివాహం అయింది అన్న విషయం అభిషేక్ తెలియదు.అశ్విని కి వివాహం అయ్యింది అనే విషయం తెలిసిన అభిషేక్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఆసిఫ్ నగర్ పోలీసులు అశ్విని తమదైన శైలిలో విచారించగా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి.ప్రస్తుతం పోలీసులు అశ్విని ను అదుపులోకి తీసుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube