Shah Rukh Khan : షారుఖ్ ఖాన్ కి బలవంతంగా ముద్దు పెట్టిన యువతి.. వీడియో వైరల్?

బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్( shah rukh khan ) గురించి మనందరికీ తెలిసిందే.ఇటీవల కాలంలో తరచూ ఏదోక విషయంతో వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు షారుఖ్ ఖాన్.

 Shah Rukh Khan Gets Kissed By Female Fan-TeluguStop.com

కాగా బాలీవుడ్ లో ఎన్నో సినిమాల్లో నటించి స్టార్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్న షారుఖ్ ఖాన్ ప్రసాప్రస్తుతం వరసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నాడు.కాగా ఇటీవలె పఠాన్( Pathaan ) ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.

భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా కోట్లలో కలెక్షన్స్ రాబట్టడంతో పాటు అన్ని భాషల్లో సూపర్ హిట్ టాక్ ని అందుకుని కలెక్షన్ ల సునామీని సృష్టించింది.

ఈ సినిమాతో బాలీవుడ్ కి మరోసారి పూర్వ వైభవాన్నీ తీసుకువచ్చారు షారుఖ్ ఖాన్.అంతేకాకుండా ఈ సినిమా షారుఖ్ కెరియర్ లోనే ది బెస్ట్ సినిమాలలో ఒకటిగా నిలిచిన విషయం తెలిసిందే.ఈ సినిమా విడుదలకు ముందు వరకు కెమెరాలకు దూరంగా ఉంటూ వచ్చిన షారుక్ ఖాన్ సినిమా విడుదల తర్వాత కెమెరాల ముందుకు రావడంతో పాటు పబ్లిక్ లోకి కూడా వస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే తాజాగా షారుఖ్ ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ నేపథ్యంలోనే షారుక్ ఖాన్ ఊహించని ఘటన అక్కడ ఒకటి చోటు చేసుకుంది.

దుబాయ్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో షారుక్ ఖాన్ లోపలికి ఎంట్రీ ఇవ్వగానే అక్కడున్న వారందరూ కూడా ఆనందంతో కేకలు వేశారు.మొదట ఒక అతను వచ్చి షారుఖ్ ఖాన్ కి హాగ్ ఇవ్వగా ఇంతలో ఒక మహిళా అభిమాని కాస్త ఇబ్బందికరంగా ప్రవర్తించింది.షారుఖ్ అనుమతి తీసుకోకుండానే ఆయన్ని బలవంతంగా ముద్దు పెట్టుకుంది.కాగా ఆ మహిళా షారుఖ్‌ వద్దకు చేరుకుని మిమ్మల్ని ముద్దుపెట్టుకోవచ్చా? అని అడిగింది.అప్పుడు షారుఖ్ సమాధానం చెప్పేలోపే ఆయన బుగ్గపై బలవంతంగా ముద్దుపెట్టింది.తన అభిమాన హీరోని ముద్దుపెట్టుకున్నానన్న ఆనందంతో వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయింది.

అయితే, అభిమాని చేసిన పనితో షారుఖ్‌ కాస్త ఇబ్బందిగా కనిపించారు.ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

దీనిని చూసిన పలువురు అభిమానులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.కొంతమంది ఆమె ప్రవర్తనను తప్పుబడుతుంటే మరికొంతమంది మాత్రం.

ఆమె అదృష్టవంతురాలంటూ కామెంట్స్‌ పెడుతున్నారు.ఇకపోతే షారుక్ ఖాన్ సినిమాల విషయానికొస్తే.

షారుఖ్‌ ఖాన్ ప్రస్తుతం జవాన్‌( Jawan ), డుంకీ సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube