తెలంగాణలోని నిర్మాణాలను అంతర్జాతీయ అవార్డులు వరించాయి.దేశంలోనే తొలిసారిగా తెలంగాణలోని ఐదు నిర్మాణాలకు గ్రీన్ యాపిల్ అవార్డులు వచ్చాయి.
ఈ మేరకు లండన్ కు చెందిన గ్రీన్ ఆర్గనైజేషన్ అవార్డులను ప్రకటించింది.ఇందులో సచివాలయంతో పాటు కేబుల్ బ్రిడ్జికి ఇంటర్నేషనల్ బ్యూటీపుల్ బిల్డింగ్స్ గ్రీన్ యాపిల్ అవార్డు వరించింది.
దాంతో పాటు కమాండ్ కంట్రోల్ సెంటర్, మొజాంజాహీ మార్కెట్ మరియు యాదాద్రి ఆలయానికి బ్యూటిపుల్ బిల్డింగ్స్ గ్రీన్ యాపిల్ అవార్డు లభించింది.కాగా ఈ అవార్డులను ఈనెల 16వ తేదీన లండన్ లో గ్రీన్ ఆర్గనైజేషన్ అందించనుంది.
మరోవైపు తెలంగాణ రాష్ట్రానికి ఐదు అంతర్జాతీయ అవార్డులు రావడంపై సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు.







