నిజామాబాద్ జిల్లాలోని తెలంగాణ యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళన కార్యక్రమం చేపట్టారు.ఇందులో భాగంగా పరిపాలన భవనాన్ని విద్యార్థులు ముట్టడించారు.
మెస్ మూసివేయడంతో భోజన సదుపాయం లేక విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.అయితే వేతనాలు చెల్లించడం లేదని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు విధులు బహిష్కరించడం తెలిసిందే.
ఈ నేపథ్యంలో యూనివర్సిటీకి వచ్చిన వీసీని విద్యార్థులు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు అడ్డుకున్నారు.దీంతో వర్సిటీ వద్ద ఉద్రిక్తత నెలకొంది.







