నాగుల ఎల్లమ్మను దర్శించుకున్న జెడ్పిటిసి సభ్యులు చీటీ లక్ష్మణరావు( Cheeti Lakshmana Rao ).రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపురం గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో నాగుల ఎల్లమ్మ ప్రతిష్ట కార్యక్రమం మంగళవారం ఘనంగా జరిగింది.
మంగళవారం ఉదయం నాగుల ఎల్లమ్మ అమ్మవారి యంత్రానికి జలదివాసం యంత్ర ప్రతిష్ట గణపతి హోమం రుద్రహోమం శ్రీ సూక్తం పంచసూక్త హవనం పూర్ణహుతి మంగళహారతి కార్యక్రమాలను గ్రామ పురోహితులు బుగ్గ శ్రీనివాస్ శర్మ ఆధ్వర్యంలో పి రాజశేఖర్ శర్మ, రామశర్మ కన్నుల పండుగగా జరిగాయి.ఈ సందర్భంగా ఎల్లారెడ్డిపేట జెడ్పిటిసి సభ్యులు చీటీ లక్ష్మణరావు, సెస్ డైరెక్టర్ వరుస కృష్ణ హరి , తిమ్మాపురం సర్పంచ్ పడిగల రవీందర్ గుప్తా , ఎంపీటీసీ సభ్యులు వరదబాబు , సింగిల్ విండో అధ్యక్షులు సుధీర్రావు , గుండారపు కృష్ణారెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ కొండ రమేష్ గౌడ్ అందే సుభాష్ , ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు భూక్య సిత్యా నాయక్ , బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు బండారి బాల్ రెడ్డి ,నాగుల ఎల్లమ్మను దర్శించుకున్నారు.
వారిని గౌడ సంఘం వారు శాలువలు కప్పి సన్మానించారు.ఈ కార్యక్రమంలో స్థానిక గౌడ సంఘం అధ్యక్షులు తీగల శ్రీనివాస్ గౌడ్ బొంబోతుల నరసింహులు గౌడ్ ఆధ్వర్యంలో గౌడ సంఘం ప్రతినిధులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
గౌడ సంఘం మహిళలు గ్రామం నుండి ఎల్లమ్మ గుడి వరకు బోనాల ఊరేగింపు తీశారు.అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్త కోటికి తీర్థ ప్రసాదం వితరణ చేశారు.
అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.







