పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ప్రస్తుతం తన ఫోకస్ మొత్తం సినిమాల మీద పెట్టి వరుస సినిమాలను పూర్తి చేస్తూ పోతున్నాడు.అటు రాజాకీయ ప్రణాళికలు చేస్తూనే ఇటు సినిమా షూటింగులు కూడా ఆగకుండా చేసేలా ప్లాన్ చేస్తున్నాడు.
టాలెంటెడ్ డైరెక్టర్ సుజీత్( Director Sujeeth ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు ఇప్పటికే పెరిగి పోయాయి.
వరుస అప్డేట్ లను అందిస్తూ మరింత హోప్స్ పెంచుకుంటున్న ఈ సినిమా నుండి తాజాగా మరో అప్డేట్ వచ్చిన విషయం తెలిసిందే.
అర్జున్ దాస్ ఉన్నట్టు ప్రకటించిన మేకర్స్ తాజాగా వెర్సటైల్ నటి శ్రీయ రెడ్డి( Sriya Reddy ) ఉన్నట్టు ప్రకటించి సర్ప్రైజ్ చేసారు.విశాల్ హీరోగా నటించిన పొగరు సినిమాలో నెగిటివ్ రోల్ లో మెప్పించిన బ్యూటీనే శ్రీయ రెడ్డి.
ఈ సినిమా ఇప్పటికి ఆడియెన్స్ కు బాగా గుర్తు ఉంది.ఈ భామ గత కొన్ని రోజులుగా సినిమాలకు దూరంగా ఉంటుంది.
అయితే సలార్ సినిమాలో నటిస్తున్నట్టు ఈ మధ్య ప్రకటన రాగా ఇప్పుడు పవన్ ఓజిలో ( OG ) కూడా భాగం అయినట్టు తెలుస్తుంది.ఈమెకు వెల్కమ్ చెబుతూ మేకర్స్ అఫిషియల్ ప్రకటన చేసారు.
మరి వీరి వెల్కమ్ కు శ్రీయ రెడ్డి కూడా థాంక్స్ చెబుతూ చిత్ర యూనిట్ గురించి ఆసక్తికర పోస్ట్ చేసింది.

ఈ సినిమా కథ మైండ్ బ్లోయింగ్ స్క్రిప్ట్ అని సుజిత్ అద్భుతమైన కథ తన రోల్ ను డిజైన్ చేసాడని.ఈ కథ విన్న 5 నిముషాల్లోనే నేను ఓకే చెప్పానని చెప్పుకొచ్చింది.మరి ఈమె చెప్పినది విన్న ఫ్యాన్స్ పవర్ స్టార్ ఓజిపై మరిన్ని ఆశలు పెట్టుకుంటున్నారు.
చూడాలి ఈ మోస్ట్ ఏవైటెడ్ మూవీ ఎలా ఉంటుందో.

కాగా మాసివ్ గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కు జోడీగా ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది.అలాగే ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా.డివివి దానయ్య డివివి ఎంటర్టైన్మెంట్స్ పై భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.







