ప్రస్తుత కాలంలో కెరీర్ పరంగా ఎదగాలన్నా సక్సెస్ సాధించాలన్నా సులువు కాదనే సంగతి తెలిసిందే.పోటీ ప్రపంచంలో ఎంతో కష్టపడితే తప్ప సక్సెస్ దక్కదు.
ఓయో రూమ్స్( OYO Rooms ) గురించి వినని వాళ్లు దాదాపుగా ఉండరనే సంగతి తెలిసిందే.అయితే ఓయో సీఈవో( OYO CEO ) ఎవరనే ప్రశ్నకు మాత్రం చాలామందికి సమాధానం తెలియదు.
ఓయో సీఈవో రితేష్ అగర్వాల్( Ritesh Agarwal ) సక్సెస్ స్టోరీ తెలిస్తే మాత్రం నెటిజన్లు సైతం షాకవుతున్నారు.
ఒడిశాలోని కటక్ లో జన్మించిన రితేష్ అక్కడే చదువుకున్నారు.
కాలేజ్ లోకి అడుగుపెట్టిన రితేష్ గదిలో నాలుగు గోడల మధ్యలో కంటే బయట ప్రపంచంలో సులువుగా చదువుకోవచ్చని భావించాడు.కిరాణషాపు ఓనర్ కొడుకైన రితేష్ ఏదో ఒక పని చేసి సంపాదించాలని భావించి ప్రస్తుతం ఏకంగా రూ.9 వేల కోట్ల రూపాయలకు అధిపతి అయ్యాడు.

ఓయో రూమ్ వ్యవస్థాపకుడు రితేష్ మొదట ఓరావెల్ పేరుతో వెబ్ సైట్ మొదలుపెట్టి అందులో హాస్టళ్లు, లాడ్జ్ లు, గెస్ట్ హౌస్ లకు సంబంధించిన వివరాలను పొందుపరిచాడు.హోటల్స్ లిస్ట్ చేసే సమయంలో తనకు ఫ్రీగా గది ఇవ్వాలని అడిగినా రితేష్ కు ఎవరూ ఫ్రీగా గది ఇవ్వలేదు.ఆ సమయంలో బడ్జెట్ హోటళ్లలో సౌకర్యాలు సరిగ్గా లేవని అతనికి తెలిసింది.

బడ్జెట్ హోటల్స్ లో స్టార్ హోటల్స్ తరహా సౌకర్యాలు ఇస్తే బాగుంటుందని భావించి ఓయో దిశగా రితేష్ అడుగులు వేశారు. ఫ్రీ వైఫ్, టీవీ, బ్రేక్ ఫాస్ట్ లాంటి సౌకర్యాలతో ఓయో సక్సెస్ అయింది.ప్రస్తుతం ఇతర దేశాల్లో సైతం ఓయో సేవలు అందిస్తోంది.చుట్టూ ఉండే పరిస్థితుల గురించి తెలియడంతో పాటు, కాలానికి అనుగుణంగా మారితే సక్సెస్ సాధ్యమని రితేష్ అగర్వాల్ చెబుతున్నారు.
రితేష్ ను స్పూర్తిగా తీసుకుని కెరీర్ పరంగా ఎదిగే దిశగా ఎంతోమంది అడుగులు వేస్తున్నారు.







