సెన్సార్ వస్తే ఓటీటీలు చచ్చిపోతాయి... బాలీవుడ్ నటుడు కామెంట్స్ వైరల్!

గత మూడు సంవత్సరాల క్రితం కరోనా( Corona ) విస్తృతంగా వ్యాప్తి చెందడంతో పెద్ద ఎత్తున సినిమా షూటింగులకు బ్రేక్ పడడమే కాకుండా థియేటర్లు కూడా మూతపడ్డాయి.ఇలా థియేటర్లు మూతపడటంతో ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ అందించడం కోసం ఓటీటీ( Ott) లు వెలుగులోకి వచ్చాయి.

 If Censor Comes, Otts Will Die... Bollywood Actor, Corona , Manoj Bajpayee, Cens-TeluguStop.com

ఇలా ఓటీటీలద్వారా ఎన్నో వెబ్ సిరీస్ సినిమాలను ప్రసారం చేస్తూ వచ్చారు.అయితే ప్రస్తుతం థియేటర్లో ఓపెన్ అయినప్పటికీ ఓటీటీలకు కూడా భారీగానే డిమాండ్ ఉంది ఎన్నో సినిమాలు నేరుగా థియేటర్లో కాకుండా ఓటీటీలలో విడుదలవుతున్నాయి దీంతో ఓటీటీలకు మంచి డిమాండ్ ఉందని చెప్పాలి.

ఇక ఇందులో ప్రసారమయ్యే సినిమాలకు సెన్సార్ కట్ కూడా లేకపోవడం గమనార్హం.

Telugu Censor, Corona, Manoj Bajpayee, Tollywood-Movie

ఇలా ఓటీటీలకు సెన్సార్ ( Censor ) లేకపోవడంతో ఎన్నో బోల్డ్ కంటెంట్ ఉన్నటువంటి వెబ్ సిరీస్ కు ఇందులో ప్రసారం అవుతున్నాయి.అయితే ఈ విధంగా బోల్ట్ కంటెంట్ ఉండటం వల్ల కుటుంబంతో కలిసి ఇలాంటి సినిమాలు లేదా వెబ్ సిరీస్ లను చూడటానికి ఎంతో ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పాలి.అయితే ఇలాంటి బోల్డ్ కంటెంట్ ఉన్న వెబ్ సిరీస్ లో విడుదలవుతున్న సమయంలో ఎంతో మంది సెలబ్రిటీలు ఓటీటీలకు కూడా సెన్సార్ ఉంటే బాగుంటుందంటూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

Telugu Censor, Corona, Manoj Bajpayee, Tollywood-Movie

ఈ క్రమంలోనే బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్ పాయ్ ( Manoj Bajpayee ) కూడా తాజాగా ఓటీటీలకు సెన్సార్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.ప్రస్తుతం ఈయన నటించిన సినిమా ఓటీటీలో విడుదల కానున్న నేపథ్యంలో ఈయన ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ ఓటీటీలకు కనుక సెన్సార్ వస్తే తప్పకుండా చచ్చిపోతుందంటూ ఈయన కామెంట్స్ చేశారు.ఓటీటీ అనేది ఓ డెమొక్రటిక్ మీడియం.ఎవరు ఏం చూడాలి అని మనం నిర్ణయించలేం.ఓటీటీలు వచ్చిన కొత్తల్లో డైరెక్టర్లు తాము ఏదైతే చూపించాలి అనుకున్నారో అది ఉన్నది ఉన్నట్టుగా చూపించారు.

కానీ ప్రస్తుతం ప్రతి ఒక్కరు కూడా స్వీయ నియంత్రణ పాటిస్తున్నారు.అందరు దర్శకులు ఇలా స్వీయ నియంత్రణలో ఉండి కంటెంట్ కనుక చూపిస్తే ఓటీటీలకు ఎలాంటి సెన్సార్ అవసరం ఉండదు అంటూ ఈయన చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube