ఉప్పెన సినిమా(Uppena Movie) ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు నటి కృతి శెట్టి(Kriti Shetty).ఉప్పెన సినిమా ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె ఎంతో మంచి సక్సెస్ సాధించి అనంతరం ఇండస్ట్రీలో వరుస సినిమా అవకాశాలను అందుకున్నారు.
ఇలా వరుస సినిమాల ద్వారా ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె తిరిగి శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు వంటి సినిమాల ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.ఇలా ఈ మూడు సినిమాలు వరుసగా సక్సెస్ కావడంతో ఈమెకు భారీగా అభిమానులు కూడా పెరిగిపోయారు.
అయితే అనంతరం ఈమె నటించిన వరుస నాలుగు సినిమాలు డిజాస్టర్ గా నిలిచాయి.
ఈ విధంగా ఈమె చివరిగా కస్టడీ సినిమా (Custody Movie) ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.అక్కినేని నాగచైతన్యతో కలిసి నటించిన ఈ సినిమా తెలుగు తమిళ భాషలలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.అయితే ఈ సినిమా కూడా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయిందని తెలుస్తుంది.
ఈ విధంగా వరుసగా నాలుగు ఫ్లాప్ సినిమాలను ఎదుర్కొన్నటువంటి బేబమ్మకు అర్జెంటుగా ఒక హిట్ సినిమా పడితే తప్ప తనకు ఇండస్ట్రీలో కెరియర్ ఉండదు అంటూ పలువురు ఈమె సినీ కెరియర్ గురించి కామెంట్స్ చేస్తున్నారు.ఇదిలా ఉండగా తాజాగా కృతి శెట్టి (Kriti Shetty)గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
కృతి శెట్టి సినిమా ఇండస్ట్రీ లోకి రాకముందు నుంచే డబ్బు సంపాదించడం నేర్చుకుందని తెలుస్తుంది.అయితే ఈమె ఇలా డబ్బు సంపాదించేవారు ఏ పని చేసేవారు అనే విషయానికి వస్తే కృతి శెట్టి ఇండస్ట్రీలోకి రాకముందు చాలా అడ్వర్టైజ్మెంట్స్ (Advertisment) లో నటిస్తూ ఉండే వారట.ఈ విధంగా పలు యాడ్స్ చేస్తూ సినిమా అవకాశాల కోసం ప్రయత్నాలు చేశారని తెలుస్తుంది.ఈ విషయం చాలామందికి బహుశా తెలియకపోవచ్చు.ఇలా అడ్వర్టైజ్మెంట్ ద్వారా కృతి శెట్టి ఇండస్ట్రీలోకి రాక ముందు నుంచే డబ్బు సంపాదించడం నేర్చుకున్నారని అయితే ఇండస్ట్రీలో తనకు స్టార్ స్టేటస్ వచ్చిన తర్వాత యాడ్స్ చేయడానికి ఆసక్తి చూపించడం లేదని తెలుస్తుంది.