Megastar Chiranjeevi : చిరంజీవి కోసం అలాంటి టైటిల్ ను ఫిక్స్ చేసిన వశిష్ట.. టైటిల్ భలే ఉందంటూ?

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ( Megastar Chiranjeevi )ప్రస్తుతం వరుసగా సినిమా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.సినిమా హిట్టు ఫ్లాప్ తో సంబంధం లేకుండా అవకాశాలను అందుకుంటున్నారు మెగాస్టార్.

 Mega Star Chiranjeevi Director Vasishta Movie Title Fix-TeluguStop.com

ఈ వయసులో కూడా అదే ఊపుతో సినిమాలలో నటిస్తూ యంగ్ హీరోలకు పోటీగా నిలుస్తున్నారు.ఇకపోతే ఈ ఏడాది ఆరంభంలో వాల్తేరు వీరయ్య( Waltheru Veeraya ) సినిమాతో ప్రేక్షకులను పలకరించిన మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం భోళా శంకర్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.

ఈ సినిమాకు మొహర్ రమేష్ దర్శకత్వం వహిస్తుండగా ఇందులో తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.

Telugu Vasishta, Chiranjeevi, Tollywood-Movie

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.ఇకపోతే అసలు విషయంలోకి వెళితే.గత ఏడాది బింబిసార సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ను అందుకున్న డైరెక్టర్ వశిష్ఠ( Director Vasishtha ) మెగాస్టార్ చిరంజీవికి ఒక కథను వినిపించగా అందుకు మెగాస్టార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట.

అయితే ఈ సినిమా కంటే ముందు వశిష్ఠ బింబిసార 2 ( Bimbisara 2 )సినిమాను తెరకెక్కించబోతున్నాడు అంటూ వార్తలు వినిపించినప్పటికీ అవన్నీ అవాస్తవాలు గానే మిగిలిపోయాయి.తర్వాత మధ్యలో చిరంజీవితో వశిష్ఠ మూవీ ఛాన్స్ లేదు అంటూ ప్రచారం కూడా జరిగింది.

ఇది ఇలా ఉంటే తాజాగా అందిన సమాచారం ప్రకారం.

Telugu Vasishta, Chiranjeevi, Tollywood-Movie

వశిష్ఠ, మెగాస్టార్ కాంబోలో రాబోతున్న సినిమా సోషియో ఫాంట‌సీ నేపథ్యంలో అనగా జ‌గ‌దేక వీరుడు అతిలోక సుంద‌రి సినిమాల మాదిరిగా ఉండబోతోంది అని తెలుస్తోంది.అంటే ఆ సినిమాలో శ్రీదేవి దేవకన్యలా భూమి మీదకు వచ్చి సామాన్యుడైన చిరంజీవివీ ప్రేమిస్తే, ఇక్కడ దేవలోకం నుండి కాకపోయిన ముల్లోకాల నుండి భామలు హీరోగారి కోసం దిగుతారట.అంటే ఈ సినిమాలో చాలామంది హీరోయిన్స్ కనిపిస్తారని తెలుస్తోంది.

మరి ఆ హీరోయిన్లు ఎవరు అన్నది తెలియాల్సి ఉంది.కాగా ఈ సినిమాకు ముల్లోక వీరుడు అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్టుగా కూడా వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.

ఇది వ‌ర్కింగ్ టైటిల్ మాత్రమే అని తెలుస్తుంది.ఈ టైటిల్ కి చిరు ఓకె చెబితే అదే పోస్ట‌ర్ పై కూడా ఫిక్స‌య్యే అవ‌కాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube