తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ హీరో మంచు మనోజ్( Manchu Manoj ), భార్య భూమా మౌనిక రెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.గత కొంతకాలంగా వీరి పేర్లు సోషల్ మీడియాలో మారుమోగిన సంగతి మనందరికీ తెలిసిందే.
ఎట్టకేలకు ఇటీవలే ఈ జంట మూడుముళ్ల బంధంతో ఒకటయ్యారు.పెళ్లి తర్వాత కూడా తరచూ ఏదోక విషయంతో ఈ జంట పేర్లు సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉన్నాయి.
భార్యాభర్తలు ఇద్దరూ కలిసి మంచి మంచి పనులు చేస్తూ అభిమానుల నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు.ఈ నేపథ్యంలోనే తాజాగా మరోసారి గొప్ప మనసును చాటుకున్నారు.

అయితే ఈసారి ఏం చేశారంటే ఏకంగా 2500 మంది అనాధ పిల్లలకు టాలీవుడ్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన ఆదిపురుష్( Adipurush ) సినిమాను ఫ్రీగా చూపించాలి అని అనుకున్నారు మంచు మనోజ్,మౌనిక రెడ్డి( Mounika Reddy ).తెలుగు రాష్ట్రాల్లోని పలు అనాధ శరణాలయాల్లోని 2500 మంది అనాధల కోసం టికెట్లు కొనుగోలు చేసి వారికి ఉచితంగా ఆదిపురుష్ మూవీని చూసే అవకాశం కల్పిస్తున్నట్లు తాజాగా అధికారికంగా ప్రకటించారు.కాగా ఇది మన అందరి సినిమా అని, ఇంతగొప్ప సినిమాని అందరికీ చేరువ చేయాలనేది తమ వంతు తపన అని తెలిపారు మంచు మనోజ్.అంటే హీరో మంచు మనోజ్ ఈ సినిమాను ఒకరకంగా ప్రమోట్ చేయడంతో పాటు అలా అనాధ పిల్లలకు మంచి అవకాశం కూడా కల్పించారు.

ఇందుకు సంబంధించిన వార్త చూసిన మీడియాలో వైరల్ అవ్వడంతో మంచు అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.అలాగే ప్రభాస్ అభిమానులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నారు మీరు ఎల్లప్పుడూ ఇలాగే ఆలోచిస్తూ మంచిగా ఎదగాలి అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.ఇకపోతే ఆది పురుష్ సినిమా విషయానికి వస్తే.
ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రభాస్ కృతి సనన్( Prabhas ,Kriti Sanon ) జంటగా నటించిన విషయం తెలిసిందే.భారీ మైథలాజికల్ జానర్ మూవీ ఆదిపురుష్.
టి సిరీస్ ఫిలిమ్స్, రిట్రో ఫైల్స్ సంస్థల పై అత్యంత భారీ వ్యయంతో నిర్మితం అయింది.ఈ సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు బాలీవుడ్ లో కూడా ఈ సినిమా ప్లీక్రేజ్ జ్ మామూలుగా లేదు.అభిమానులతో పాటు సెలబ్రిటీలు సైతం ఈ సినిమా కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
మరి ఈ సినిమా ఎటువంటి అంచనాలను క్రియేట్ చేస్తుందో చూడాలి మరి.








