ప్రస్తుతం అందరూ సోషల్ మీడియాలో గడుపుతున్నారు.గంటల కొద్ది సోషల్ మీడియాలోనే ఉంటున్నారు.
పొద్దున్నే లేచి దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు సోషల్ మీడియాలో ఎక్కువగా ఉండేవారు ఎక్కువమంది ఉన్నారు.సోషల్ మీడియాలో న్యూస్ అప్డేట్స్‌ను తెలుసుకోవడంతో పాటు ఛాటింగ్ చేయడం, ఫొటోలు, వీడియోలు చూడటం లాంటివి చేస్తున్నారు.
అలాగే తమ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తున్నారు.

అయితే ఒకప్పుడు సోషల్ మీడియాలో సెలబ్రెటీల( Celebrities ) అకౌంట్‌లకు మాత్రమే బ్లూటిక్ వచ్చేది.కానీ ఇటీవల సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్ ఆదాయం కోసం అందరికీ బ్లూటిక్ ఇచ్చేస్తున్నాయి.కానీ ఇందుకోసం కొంతమేర డబ్బులు వసూలు చేస్తున్నాయి.
ఇప్పటికే ట్విట్టర్ అందరూ డబ్బులు చెల్లించి బ్లూటిక్ పొందే విధానాన్ని ప్రవేశపెట్టగా.మిగతా కంపెనీలు కూడా అదే ఫాలో అవుతున్నాయి.
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్( Facebook, Instagram ) వంటి సంస్థలు కూడా బ్లూటిక్ ఆప్షన్ ను తీసుకురానున్నాయి.

జూన్ 7 నుంచి ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ బ్లూటిక్ ఆప్షన్‌ను( blutick option ) తీసుకురానుండగా.ఇందుకోసం ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లు నెలకు రూ.699 చెల్లించాల్సి ఉంటుంది.అలాగే రానున్న రోజుల్లో నెలకు రూ.599కే వెబ్ బేస్డ్ సబ్‌స్క్రిప్షన్ తెచ్చే ఆలోచనలో ఉంది.బ్లూటిక్ కోసం యూజర్లు ప్రభుత్వ గుర్తింపు కార్డు ఏదైనా సమర్పించాల్సి ఉంటుంది .దీని వల్ల కొన్ని రకాల ప్రత్యేక ఫీచర్లు కూడా లభిస్తాయని మోటా చెబుతోంది.18 సంవత్సరాలు నిండివారికి మాత్రమే ఇండియాలో బ్లూటిక్ ఇవ్వనుండగా.ఇచ్చేముందు యూజర్ల పోస్టులను చెక్ చేస్తారు.
పేరు, ఫొటోలు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లోని వివరాలతో సరిపోలితేనే బ్లూ టిక్ వస్తుంది.గతంలో రాజకీయ నేతలు, సినీ నటులు, మీడియా సంస్థలకు సంబంధించిన ఖాతాలకు మాత్రమే ఫేస్‌బుక్‌లో బ్లూటిక్ ఇచ్చేవారు.
కానీ ఇప్పుడు ఎవరైనా డబ్బులు చెల్లించి తీసుకునేలా మెటా అవకాశం కల్పించింది.







