మరోసారి భర్త ని తలచుకొని బోరుమని ఏడ్చేసిన శ్రీహరి భార్య డిస్కో శాంతి

తెలుగు చలన చిత్ర పరిశ్రమ గర్వపడే నటులలో ఒకరు రియల్ స్టార్ శ్రీహరి( Srihari ).ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ సపోర్టు లేకుండా, ఒక స్టంట్ మ్యాన్ గా కెరీర్ ని ప్రారంభించి, ఆ తర్వాత హీరో విలన్ గా హీరో గా మరియు క్యారక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో వందల సినిమాల్లో నటించి తిరుగులేని స్టార్ గా ఎదిగాడు.

 Srihari's Wife Disco Shanti Who Once Again Cried Thinking Of Her Husband , Sriha-TeluguStop.com

ముఖ్యంగా క్యారక్టర్ ఆర్టిస్టుగా( character artist ) గా మారిన తర్వాత ఆయనకీ దక్కినన్ని మంచి పాత్రలు ఏ మరో నటుడికి దొరకలేదు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.పెద్ద పెద్ద స్టార్ డైరెక్టర్స్ తో సినిమాలు చేస్తూ, ఆ సినిమాల్లో ప్రేక్షకులు ఎప్పటికి మర్చిపోలేని పవర్ ఫుల్ పాత్రలు ఎన్నో చేసాడు.

టాలీవుడ్ నుండి ఆయన రేంజ్ బాలీవుడ్ కి కూడా వెళ్ళింది.అలా బాలీవుడ్ ( Bollywood )సినిమా షూటింగ్ చేస్తున్న సమయం లోనే ఆయన కుప్పకూలి పడిపోయాడు, వెంటనే ఆయనని హాస్పిటల్ కి తరలిస్తుండగా, మధ్యలోనే తన తుది శ్వాసని వదిలేసాడు.

Telugu Bollywood, Disco Shanti, Raj Doot, Srihari-Latest News - Telugu

ఆయన చనిపోయాడు అనే వార్త అప్పట్లో సినీ ఇండస్ట్రీ కి మరియు అభిమానులకు పెద్ద షాక్.ఇప్పుడు గుర్తు చేసుకున్నా కూడా మన కళ్ళలో నీళ్లు తిరిగేస్తాయి.ఆయనతో తెలుగు ప్రేక్షకులకు ఉన్న అనుబంధం అలాంటిది.తాను పొరపాటున చనిపోయిన కూడా తన భార్య పిల్లలు, మనవళ్లు కూర్చొని తిన్నా తరగని ఆస్తిని సంపాదించి పెట్టి వెళ్ళాడు.

ఐటమ్స్ సాంగ్స్ చేసుకునే డిస్కో శాంతి ( Disco Shanti )గారిని ప్రేమించి పెళ్లాడిన శ్రీహరి, ఆమెని కంటికి రెప్పలాగా కాపాడుకున్నాడు.బ్రతికి ఉన్నన్ని రోజులు మాత్రమే కాదు, చనిపోయిన తర్వాత కూడా కలకాలం సుఖం గా జీవించేంత డబ్బులను ఇచ్చేసి పోయాడు.

రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో ప్రముఖ యాంకర్ శ్రీహరి తాలూకు జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ అతని పాటలు పాడుతుండగా, డిస్కో శాంతి గారు బోరుమని ఏడ్చేశారు.ఎందుకు ఇప్పుడు అవన్నీ గుర్తు చేస్తున్నావ్ అంటూ ఆమె తనని తాను కంట్రోల్ కూడా చేసుకోలేకపోయింది.

Telugu Bollywood, Disco Shanti, Raj Doot, Srihari-Latest News - Telugu

ఈ ఇంటర్వ్యూ లో ఆమెతో పాటు పెద్ద కొడుకు కూడా ఉన్నాడు.పెద్ద కొడుకు ఒక సినిమాలో హీరో గా నటించాడు,ఆ చిత్రం పేరు ‘రాజ్ దూత్’( Raj Doot ).కమర్షియల్ గా ఆ సినిమా పెద్ద సక్సెస్ కాలేదు, దాంతో ఆ కుర్రాడికి మళ్ళీ సినిమాల్లో అవకాశాలు రాలేదు.అదే ఈరోజు శ్రీహరి బ్రతికి ఉండుంటే, తన కొడుకు ని పెద్ద పెద్ద స్టార్ డైరెక్టర్స్ తో సినిమాలు చేయించి, ఎక్కడో పెట్టేవాడు, కానీ ఆ అదృష్టం లేకపోయింది.

ఇండస్ట్రీ లో ఉన్న ప్రముఖులు కూడా శ్రీహరి చనిపోయిన తర్వాత ఆయన ఇంటి వైపు చూడడం కూడా ఆపేసారు, ఇదేనా ఒక లెజెండరీ హీరో కుటుంబానికి ఇండస్ట్రీ ఇచ్చే గౌరవం అంటూ కొంతమంది విమర్శకులు కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube