ఆ విషయంలో గొడవ.. భార్య, అత్తను అతి దారుణంగా..!

కుటుంబంలో చిన్నచిన్న గొడవలు, మనస్పర్ధలు లాంటివి సహజమే.సర్దుకుపోతే ఆ కుటుంబంలో సంతోషాలు ఆకాశాన్ని అంటుతాయి.

 Husband Killed Wife And Mother In Law In Kurnool District Details, Husband, Kill-TeluguStop.com

లేకపోతే కుటుంబం నాశనం అయ్యి రోడ్డున పడుతుంది.ఈమధ్య భార్యను వేధించే భర్తల సంఖ్య క్రమంగా పెరుగుతూ పోతుంది.

చిన్న చిన్న కారణాలకే భార్యలను విచక్షణారహితంగా వేధిస్తున్నారు.ఇలాంటి కోవకు చెందిన ఓ భర్త, తన భార్యను వేధిస్తూ తన మాట వినలేదని దారుణమైన నిర్ణయం తీసుకున్నాడు.

భార్యతో పాటు అత్తపై కూడా దారుణంగా దాడి చేసిన ఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది.

వివరాల్లోకెళితే.

కర్నూల్ జిల్లాలోని( Kurnool District ) కౌతాళం మండలంలో తలారి హనుమంతమ్మ( Talari Hanumanthamma ) నివాసం ఉంటుంది.ఈమె కూతురు మహాదేవి( Mahadevi ) స్థానికంగా వాలంటీర్ గా పని చేస్తోంది.

అయితే మహాదేవి కి, వీరలదిన్నే గ్రామానికి చెందిన దస్తగిరి తో( Dastagiri ) ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది.కొన్ని కారణాలవల్ల మహాదేవి విడాకులు తీసుకుంది.

ఆ తరువాత కర్ణాటకలోని టెక్కలి కోటకు చెందిన బోయ రమేష్ ను నెల రోజుల క్రితం రెండో వివాహం చేసుకుంది.ఇంతవరకు బాగానే ఉంది.

Telugu Ayyappa, Boya Ramesh, Dastagiri, Kautalam, Kurnool, Mahadevi, Mother Law-

కానీ రమేష్ వివాహం తర్వాత మహాదేవి ను తనతో పాటు రావాలని వేధించేవాడు.ఈ విషయంలో భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి.తాజాగా శనివారం కూడా భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది.అయితే మహాదేవి తన తల్లిని ఒంటరిగా వదిలి రాలేనని రమేష్ కి చెప్పడంతో.ఒక్కసారిగా కోపంతో ఊగిపోయి భార్య మహాదేవి, అత్త హనుమంతమ్మ లపై కర్రతో విచక్షణారహితంగా కొట్టాడు.

Telugu Ayyappa, Boya Ramesh, Dastagiri, Kautalam, Kurnool, Mahadevi, Mother Law-

తల్లికూతుర్ల కేకలు విని చుట్టుపక్కల వారంతా అక్కడికి వచ్చి అక్కడ జరిగిన తతంగం అంతా హనుమంతమ్మ సోదరుడు అయ్యప్పకు సమాచారం అందించారు.అయ్యప్ప అక్కడికి వచ్చేలోపే రమేష్ తల్లికూతుర్లను హత్య చేశాడు.వెంటనే అయ్యప్ప పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు సంఘటనాచలానికి చేరుకొని పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాలను హాస్పిటల్ కు తరలించారు.

అయ్యప్ప ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube