పేదలు బాగుపడకూదన్నదే దుర్బుద్ది చంద్రబాబుదని సీఎం జగన్ తెలిపారు.చంద్రబాబుది పెత్తందారీ మనస్తత్వం అని విమర్శించారు.
చంద్రబాబు పేదలకు వ్యతిరేకమన్న సీఎం జగన్ పేద పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదివితే చంద్రబాబుకు నచ్చదని ఆరోపించారు.పేద పిల్లలు ట్యాబ్ లు పట్టుకుంటే చంద్రబాబు చూడలేరని విమర్శించారు.
ఎన్నికలకు ముందు చంద్రబాబు వాగ్దానాలు ఎన్నికల తరువాత మోసాలని చెప్పారు.అసలు చంద్రబాబు బతుకే మోసమని, అబద్ధమని తెలిపారు.
చంద్రబాబు పేరు చెబితే గుర్తుకు వచ్చేది వెన్నుపోటు, మోసం, దగా అని వెల్లడించారు.







