మామూలుగా సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ లకు సంబంధించి అనేక రకాల వార్తలు గాసిప్స్ రూమర్లు వినిపిస్తూనే ఉంటాయి.సోషల్ మీడియాలో ఎవరో ఒక సెలబ్రిటీకి సంబంధించిన వార్తలు వినిపిస్తూనే ఉంటాయి.
అందులో కొన్ని నిజం కాగా మరికొన్ని వార్తలు రూమర్సే అని చెప్పవచ్చు.హీరోల విషయం పక్కన పెడితే హీరోయిన్ల విషయంలో ఎక్కువగా ఇలాంటి గాసిప్స్ మనకు వినిపిస్తూ ఉంటాయి.
దీనివల్ల చాలామంది సినిమా అవకాశాలను కూడా నష్టపోయే ప్రమాదం ఉంటుంది.అటువంటి అనుభవమే తనకు ఎదురయ్యింది అంటోంది కృతిసనన్.
ఆ వివరాల్లోకి వెళితే.కృతిసనన్( kriti sanon ) గురించి మనందరికీ తెలిసిందే.

ఈమె బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటించి మెప్పించింది.ఇక ఈ ముద్దుగుమ్మ తాజాగా నటించిన పాన్ ఇండియా చిత్రం ఆదిపురుష్.ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కృతి సనన్ సీత పాత్రలో నటించిన విషయం తెలిసిందే.ఈ సినిమా జూన్ 16న విడుదల కానున్న సంగతి మనందరికీ తెలిసిందే.
విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో చిత్ర బృందం ప్రమోషన్స్ లో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు.ఈ ప్రమోషన్స్ లో భాగంగానే ఐటీవలె తిరుపతిలో ఆదిపురుష్ ( Adipurush )ప్రీ రిలీజ్ వేడుకలో కృతిసనన్ పాల్గొన్న విషయం తెలిసిందే.
ఈ వేడుక అనంతరం దర్శకుడు ఓం రౌత్, కృతి సనన్ శ్రీవారిని దర్శించుకోవడం కోసం తిరుమలకు వెళ్లారు.

అక్కడ దర్శన అనంతరం కృతి సనన్ కు దర్శకుడు ముద్దు పెట్టి, కౌగిలించుకోవడంతో వివాదం చెలరేగిన విషయం అందరికీ తెలిసిందే విషయం తెలిసిందే.ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కృతిసనన్ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.
నాకు మోడలింగ్ అంటే చాలా ఇష్టం.ఆ కారణంతోనే ఢిల్లీ నుంచి ముంబై వచ్చాను.
ఆ సమయంలో నాకు ఒక అవమానం జరిగింది.ఓ ర్యాంప్ షోలో కొరియోగ్రాఫర్ ఓం రౌత్( Om Raut ), కృతి సనన్ శ్రీవారినిఅందరు చూస్తుండగానే నాతో అసభ్యంగా ప్రవర్తించి అవమానించాడు అని ఆమె తెలిపింది.
అవమానం జరగడంతో నేను అది భరించలేక మోడలింగ్ వదిలేసి ఇంటికి వెళ్లిపోదామని అనుకున్నాను అని చెప్పుకొచ్చింది కృతిసనన్.కానీ మా అమ్మ ఇచ్చిన దైర్యంతో ఒడిదుడుకులను ఎదుర్కొని ఈ స్థాయికి చేరుకున్నాను అని తెలిపింది.







