ఇటీవల సోషల్ మీడియాలో పాపులర్ అయ్యేందుకు కొంతమంది యువకులు అనేక ప్రయత్నాలు చేస్తోన్నారు.ప్రమాదకర స్టంట్స్ చేస్తూ ప్రాణాలు కోల్పోవడంతో పాటు వింత ప్రవర్తనలతో వివాదాస్పదంగా మారుతున్నారు.
సోషల్ మీడియాలో వీడియోల కోసం పోలీస్ వెహికల్ పైకి ఎక్కి డ్యాన్స్ వేసిన వీడియో ఇటీవల బాగా వివాదాస్పదంగా మారాయి.అలాగే సోషల్ మీడియాలో పాపులర్ అయ్యేందుకు దీపావళి రోజూ ఒక యూట్యూబర్ కారులో టపాసులు పేల్చాడు.
ఇలాంటి ప్రమాదకర విన్యాసాలు చేస్తూ సోషల్ మీడియలో ఫేమస్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు.

తాజాగా ఒక యువకుడు లైక్స్ కోసం చేసిన పని అందరికీ నవ్వు తెప్పిస్తుంది.మహిళలు వేసుకునే గౌను వేసుకుని మార్కెట్‌కు వెళ్లాడు.అక్కడ కాసేపు తిరిగాడు.
ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ వీడియోలో ఒక యువకుడు లేడీస్ వేసుకునే గౌను వేసుకుని( Wearing a gown ) మార్కెట్ లో ఉన్నాడు.అక్కడ ఒక టీ షర్ట్( T shirt ) ను పట్టుకుని అది కొనుగోలు చేస్తున్నట్లు కనిపించాడు.
అలాగే అక్కడ ఉన్నవారిని ఆట పట్టిస్తూ ఉన్నాాడు.ఈ వీడియోపై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు.

లైక్స్ కోసం ఇంతగా చేయాలా అని అంటున్నారు.మరి ఇంతగా ప్రవర్తించడం అవసరమా అని మరికొందరు కామెంట్ చేస్తున్నారు.ఈ వీడియోలోని వ్యక్తి ఎక్కడివాడు.ఈ ఘటన ఎక్కడ జరిగిందనే వివరాలు మాత్రం బయటకు రాలేదు.అయితే ఐ లవ్ పాట్నా అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ వీడియో షేర్ చేశారు.ఈ వీడియోపై కొంతమంది నెటిజన్లు మండిపడుతున్నారు.
లైక్ ల కోసం, సోషల్ మీడియాలో పాపులర్ అవ్వడం కోసం ఇలా అమ్మాయి డ్రెస్ లు వేసుకుని పబ్లిక్ లోకి పోవడం వికారంగా అనిపిస్తుందని పేర్కొంటున్నారు.







