సినీ ఇండస్ట్రీలో సరైన హిట్ ఒక్కటి పడితే చాలు.లైఫ్ ఎక్కడికో వెళ్లి పోతుంది.
అదే ఒక్క ప్లాప్ వస్తే ఎంత స్పీడ్ గా ఎదిగారో అంత కంటే ఫాస్ట్ గా పాతాళంలోకి వెళ్ళిపోతారు.ఎంత స్టార్స్ కైనా ఇదే పరిస్థితి.
మళ్ళీ హిట్ పడితే కానీ తట్టుకుని నిలబడడం చాలా కష్టం.ఎవరో ఒకరు ఇలా అన్నిటిని తట్టుకుని మళ్ళీ పైకి లేస్తారు.
మరి ఇదే ఒక డైరెక్టర్ విషయంలో జరిగింది.
సవ్యసాచి సినిమాతో( Savyasachi movie ) డైరెక్టర్ చందు మొండేటి( Director Chandoo Mondeti ) పని అయిపొయింది అని చాలా మంది అనుకున్నారు.
ఈ సినిమా తర్వాత మళ్ళీ ఇండస్ట్రీలో నిలదొక్కుకునేందుకు తాను ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన కార్తికేయ సినిమానే నమ్ముకుని సీక్వెల్ తీసాడు.ఈ సినిమా సీక్వెల్ ను ఎంతో కస్టపడి అద్భుతంగా తెరకెక్కించి మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.

ఈ సినిమా హిట్ ఎలా రీసౌండ్ వచ్చింది అంటే ఈయన మొన్నటి వరకు సినిమా చేసేందుకు వెనకడుగు వేసిన నిర్మాతలు మళ్ళీ పిలిచి మరీ అవకాశం ఇచేలా చేసుకున్నాడు.కార్తికేయ 2 సినిమా తర్వాత ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు సినిమాలను ఒక చేసినట్టు తెలుస్తుంది.అది కూడా గీతా ఆర్ట్స్( Geetha Arts ) వారు పిలిచి మరీ వారి దగ్గరే పెట్టుకుని మూడు ప్రాజెక్టులు తన చేతిలో పెట్టినట్టు తెలుస్తుంది.
మరి ఈ మూడు సినిమాలను దాదాపు 30 కోట్లు ముట్టజెప్పారట.
ఒక్కో సినిమాకు 10 కోట్లు అంటే మాములు విషయం కాదు.ఈ రెమ్యునరేషన్ నే అర్ధం అవుతుంది ఈయన క్రేజ్ ఏంటో.
ఇక ఈ మూడు సినిమాలో ఒకటి సూర్యతో తీయబోతుండగా మరొకటి బాలీవుడ్ మూవీ అని తెలుస్తుంది.ఇక మూడవ సినిమా నాగ చైతన్యతో అని టాక్ వస్తుంది.
ఎన్ని ఆఫర్స్ వచ్చిన మా మీద అభిమానంతో అలా ఉండిపోయాడు చందు అని అల్లు అరవింద్ ఇతడిపై ప్రశంసలు కురిపించారు.







