హీరోయిన్ అనిత( Heroine ANITA ) అంటే తెలుగు ప్రేక్షకులకు అంత గుర్తుకు రాకపోవచ్చు కానీ.నువ్వు నేను మూవీ హీరోయిన్( Nuvvu Nenu Movie Heroine ) అంటే ఇట్టాగే గుర్తుపట్టేస్తుంటారు.
ఒకప్పుడు తెలుగులో లవ్ సినిమాలలో నటించి ప్రేక్షకుల మదిలో మంచి స్థానాన్ని గెలుచుకుంది.బాలీవుడ్ ఇండస్ట్రీ కి చెందిన ఈమె గతంలో తెలుగు సినీ ఇండస్ట్రీలో వరుస సినిమాలలో నటించింది.
2001 తేజ దర్శకత్వంలో( Director Teja ) వచ్చిన నువ్వు నేను సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది.ఈ సినిమాలో తన నటనకు మంచి పేరు సంపాదించుకుంది.
ఆ తర్వాత శ్రీరామ్, నిన్నే ఇష్టపడ్డాను, నేను పెళ్ళికి రెడీ, తొట్టి గ్యాంగ్ సినిమాలలో చేసిన తర్వాత బాలీవుడ్ కి వెళ్లి అక్కడే సెటిల్ అయింది.
అలా 2003లో కుచ్ తో హై( Kutch to Hai ) అనే సినిమాతో పరిచయమైంది.ఇక ఈ సినిమా తర్వాత బాలీవుడ్ లో తనకు మంచి అవకాశాలు వచ్చాయి.ఇక సీరియల్ లో నెగటివ్ రోల్ లో కూడా చేసింది.
ఈమెకు టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా మంచి అభిమానం ఉంది.ఒక మంచి హోదాలో ఉన్న సమయంలో ఆమె 2013లో ప్రముఖ వ్యాపారవేత రోహిత్ రెడ్డిని( Businessman Rohit Reddy ) గోవాలో పెళ్లి చేసుకుంది.
వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.
సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.
ఈ వయసులో కూడా తను మంచి ఫిజిక్ తో ఉంది.బాగా వర్క్ అవుట్ లు చేస్తూ కష్టపడుతూ కనిపిస్తుంది.
సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక పోస్ట్ షేర్ చేస్తూనే ఉంటుంది.తన భర్తతో ఫన్నీ ఫన్నీ వీడియోస్ చేస్తూ తన ఫాలోవర్స్ కు పంచుకుంటుంది.
అప్పుడప్పుడు ఫ్రెండ్స్ తో కలిసి దిగిన ఫోటోలను కూడా బాగా షేర్ చేస్తూ ఉంటుంది.
అయితే ఇదంతా పక్కనే పెడితే చూడడానికి చాలా అందంగా ఉంటుంది.కెరీర్ మొదటి నుంచి ఇప్పటివరకు ఆమె అందంలో అస్సలు మార్పు రాలేదు.శరీరంలో కూడా ఎటువంటి మార్పు లేదు.
అయితే తాజాగా తను పంచుకున్న వీడియోలో తను ముసలిదైనట్లు కనిపించింది.ఇంతకు అసలు విషయం ఏంటంటే.
తాజాగా అనిత తన ఇంస్టాగ్రామ్ లో ఒక వీడియో షేర్ చేసుకుంది.
అయితే అందులో తన బాబుకు ఫుడ్ తినిపిస్తున్నట్లు కనిపించింది.
ఇక తన బాబు ఆ ఫుడ్ తినటానికి చాలా టైం తీసుకోవడంతో.అంతే ఓపికతో తినిపిస్తూ కనిపించింది అనిత.
అలా తినిపిస్తూ తినిపిస్తూ ముసలిది అయినట్లు కనిపించింది.అంటే ప్రతి తల్లుల బాధ ఇదే అంటూ.
పిల్లలు తినటానికి చాలా టైం తీసుకుంటారు అని.మనం ముసలి వాళ్లు అయినా కూడా వాళ్ళు తింటూనే ఉంటారు అని సరదాగా ఆ వీడియోలో పంచుకుంది.ఇక ఆ వీడియో చూసిన వాళ్లంతా తెగ నవ్వుకుంటున్నారు.ప్రస్తుతం ఆ వీడియోతో పాటు ముసలిదైన అనిత ఫోటో బాగా వైరల్ అవుతుంది.