మహేష్ తో మల్టీ స్టారర్ చేస్తా అంటున్న ఎన్టీయార్... ఎందుకంటే..?

నందమూరి చిన్నోడు గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఎన్టీయార్ ( NTR ) ఆ తర్వాత వరుస హిట్ సినిమాలతో ఇండస్ట్రీ లో స్టార్ హీరో గా గుర్తింపు పొందాడు…ప్రస్తుతం ఆయన పాన్ ఇండియా హీరోగా గ్లోబల్ స్టార్ గా పేరు సంపాదించుకున్నారు…ఇక ఎన్టీఆర్ నటిస్తున్న సినిమాలన్నీ కూడా ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యాయి.ప్రస్తుత ఈయన కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా( Devara Movie ) షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు…ఇక ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో కూడా ఒక సినిమా చేస్తున్నాడు…

 Jr Ntr Multi Starrer Movie With Mahesh Babu Details, Ntr ,mahesh Babu,jr Ntr Mul-TeluguStop.com

ఇలా వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి ఎన్టీఆర్ గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొని చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

ఈ క్రమంలోనే యాంకర్ తనని ప్రశ్నిస్తూ మల్టీ స్టార్ సినిమాల గురించి ప్రశ్నలు వేశారు.ఒకవేళ మల్టీ స్టార్ సినిమాలు కనుక చేయాల్సి వస్తే ఎవరితో చేస్తారన్న ప్రశ్న వేశారు.

 Jr Ntr Multi Starrer Movie With Mahesh Babu Details, Ntr ,mahesh Babu,jr Ntr Mul-TeluguStop.com

దీంతో ఎన్టీఆర్ తన మనసులో ఉన్న కోరికను బయట పెట్టారు.తాను మల్టీ స్టార్ సినిమా కనుక చేయాల్సి వస్తే సూపర్ స్టార్ మహేష్ బాబుతో( Mahesh Babu ) చేస్తానంటూ తెలియజేశారు…

Telugu Danaveerashoora, Jrntr, Krishnavamsi, Mahesh Babu, Mahesh Babu Ntr, Ntrma

అయితే ఈయనకు మహేష్ బాబుతో చేసే అవకాశం రాకపోయినా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో చేసే అవకాశం వచ్చిందని చెప్పాలి.ఇక సీనియర్ ఎన్టీఆర్ సినిమాలలో ఏదైనా సినిమాని రీమేక్ చేయాలి అంటే ఏ సినిమాలో చేస్తారు అంటూ ప్రశ్నించగా తనకు అలాంటి అవకాశం వస్తే తప్పకుండా దానవీరశూరకర్ణ సినిమా రీమేక్ చేస్తానని ఎన్టీఆర్ ఈ సందర్భంగా తెలియజేశారు.రాజమౌళి, వివి వినాయక్, కృష్ణవంశీ ఈ ముగ్గురి దర్శకులలో ఎవరు బెస్ట్ అంటూ ఈయనని ప్రశ్నించారు…

Telugu Danaveerashoora, Jrntr, Krishnavamsi, Mahesh Babu, Mahesh Babu Ntr, Ntrma

అయితే ఈ ప్రశ్నకు ఎన్టీఆర్ (Jr NTR) సమాధానం చెబుతూ.ఈ ప్రశ్న చాలా చండాలమైన ప్రశ్న అంటూ సమాధానం చెప్పారు.ఎందుకంటే ఈ ముగ్గురు దర్శకులు ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్నటువంటి వారు అంతేకాకుండా ఈ ముగ్గురు తన కెరీర్ కు టర్నింగ్ పాయింట్ ఇచ్చిన వారేనని ఈ ముగ్గురు తనకు సమానమేనంటూ సమాధానం చెప్పారు.

ఇక చాలామంది లేడీస్ ఫ్యాన్స్ తను చాలా స్లిమ్ గా ఉండాలని కోరుకుంటారని ఎన్టీఆర్ ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి…

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube